PM Tractor Yojana: రైతులకు వరం.. సగం ధరకే ట్రాక్టర్లు.. ఈ పథకం గురించి మీకు తెలుసా?
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది.
పీఎం కిసాన్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కుసుం యోజన, పీఎం కృషి సించాయి యోజన, పీఎం కృషి వికాస్ యోజన.. ఇలా ఎన్నో పథకాల ద్వారా చేయూతనందిస్తోంది. రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఇలాంటి ఓ పథకం గురించి ఇవాళ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
వ్యవసాయంలో కూలీ ఖర్చులు ఇటీవల పెరిగిపోయాయి. కూలీ ఖర్చులను తగ్గించేందుకు యాంత్రీకరణను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీ అందిస్తోంది. ఈ క్రమంలో ట్రాక్టర్ల కొనుగోలుపై కూడా సబ్సిడీ ఇస్తోంది. 'పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన' కింద ఈ సబ్సిడీని అందజేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
నిజానికి రైతులకు వ్యవసాయానికి ట్రాక్టర్ ఎంతో ముఖ్యం. దుక్కి దున్నేది మొదలు.. పండిన పంటను మార్కెట్ తీసుకెళ్లే వరకు.. అంతటా ట్రాక్టర్ అవసరం ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ట్రాక్టర్ లేని రైతులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్టర్లు లేక ఎద్దులను వినియోగించుకోవాల్సి వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ క్రమంలోనే రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ట్రాక్టర్ యోజన (PM Tractor Yojana) పథకాన్ని తీసుకొచ్చింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన కింద రైతులకు తక్కువ ధరకు ట్రాక్టర్‌ను అందజేస్తున్నారు. అన్నదాతలకు సగం ధరకే ట్రాక్టర్లను ఇస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకం కింద రైతులు ఏ కంపెనీ ట్రాక్టర్లనైనా సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన సగం డబ్బును ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఇది కాకుండా.. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ రైతులకు ట్రాక్టర్లపై 20 నుండి 50% సబ్సిడీని కూడా అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పథకం కింద సబ్సిడీ రావాలంటే... రైతులు సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. భూమి పాస్ బుక్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటో అవసరం. ఈ వివరాలతో మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. మరిన్ని వివరాలకు మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించండి. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment