PM Sri pathashala (school) - ఇక 'పీఎం శ్రీ పాఠశాల'లు ప్రారంభం
*🌻న్యూఢిల్లీ, జూన్ 2*: చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ పొందడం ప్రస్తుత మన విద్యా విధానం. మున్ముందు కోర్సు అవగానే కొలువులు సాధించేలా విద్యార్థులు సుశిక్షితులు కానున్నారు. వారిని ఇందుకు తగినట్లుగా తీర్చిదిద్దేలా "పీఎం శ్రీ పాఠశాల"లను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. 21వ శతాబ్దపు విజ్ఞానం, నైపుణ్యాలపై వీటిలో తర్ఫీ దు ఇస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గుజరా త్ రాజధాని గాంధీనగర్లో జరుగుతున్న జాతీయ విద్యా మంత్రుల సదస్సు ను ఉద్దేశించి ఆయన గురువారం ప్రసంగించారు. ఈ పాఠశాలలు అత్యు న్నత ప్రమాణాలతో ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రాలు/యూటీలు, విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
0 Comments:
Post a Comment