Peanuts Benefits : వేరుశనగ గింజల్ని తినేటప్పుడు ఈ తప్పు చేయకండి.. బోలెడు లాభాలు చేజార్చుకున్నట్టే..
మహాత్మాగాంధీ సహా మనలో చాలా మందికి ఇష్టమైనవి వేరు శనగ గింజలు (Peanuts). మనం వాటిని వేపుకొని, ఉడకబెట్టుకొని, స్నాక్స్‌లో, స్వీట్స్‌లో ఇలా రకరకాలుగా తింటాం.
వేరు శనగల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ, సిలీనియం, ఫైబర్, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ల ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. రక్త ప్రసరణను మెరుగు చేసి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి. ఐతే మనలో చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే మనం వేరు శనగ గింజల్ని తింటున్నాంగానీ... ఆ గింజలపై ఉండే సన్నటి తోలు (తొక్క) తొలిచేస్తున్నాం. ఎందుకంటే అది మన నోటికి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ... ఆరోగ్య నిపుణులు మాత్రం వేరు శనగల్ని తొక్కలతో సహా తినమంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
* వేరుశనగ గింజల తొక్కల్లో ఆరోగ్యాన్ని పెంచే, రోజువారీ అవసరమయ్యే చాలా పోషకాలున్నాయి.
* తొక్కల్లో ఎక్కువగా ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్... వ్యాధులు రాకుండా కాపాడతాయి.
* తొక్కల్లో ఉండే పాలీఫెనాల్... బాడీలో కలిసిపోయి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం ఎండిపోకుండా చేస్తుంది.
* వేరుశనగ తొక్కల్లో కూడా గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునే గుణాలున్నాయి.
* బ్లూబెర్రీ పండ్లలో కంటే వేపిన వేరుశనగ తొక్కల్లోనే విష వ్యర్థాల్ని అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
* పీనట్ స్కిన్‌లో ఉండే ఫైబర్... శరీర అధిక బరువును తగ్గిస్తోంది.
* చిత్రమేంటంటే మామూలు వేరు శనగ గింజల కంటే వేపిన వేరుశనగ గింజల తొక్కలకు ఎక్కువ విష వ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉన్నట్లు 2012లో జరిపిన పరిశోధనల్లో తేలింది.
* విటమిన్ సీ, గ్రీన్ టీ కంటే వేపిన వేరు శనగ గింజలకు ఉండే తొక్కల్లో యాంటీఆక్సిడెంట్ (విష వ్యర్థాల్ని అడ్డుకునే పదార్థం) కంటెంట్ ఎక్కువగా ఉంది.
* ద్రాక్షపండ్లు, వైన్‌లో రెస్వెరాట్రాల్ (Resveratrol) అనే పదార్థం ఉంటుంది. అదే వేరుశనగ తొక్కల్లో కూడా ఉంటుంది. అది మనలో సహనాన్ని పెంచుతుంది. శరీరంలో మంట, వాపు, దురదల్లాంటి వాటిని తగ్గిస్తుంది. గుండె జబ్బుల్ని అడ్డుకుంటుంది. ఇది ఎక్కువగా కావాలంటే ఉడకబెట్టిన వేరుశనగ గింజల్ని తొక్కలతో సహా తినాలి.
పరిశోధనలు చెబుతున్నదొక్కటే... వేరుశనగల్ని పచ్చిగా గానీ, వేపి గానీ, ఉడకబెట్టి గానీ ఎలా తిన్నా... వాటి తొక్కలతో సహా తినేయాలి. రోజూ ఓ గుప్పెడు వేరుశనగల్ని (తొక్కతో సహా) తింటే... బోలెడంత ఆరోగ్యం మనదవుతుంది. భయంకరమైన కాన్సర్, గుండె జబ్బుల నుంచీ మనల్ని మనం కాపాడుకోవచ్చు.
0 Comments:
Post a Comment