New TDS Rule: కొత్త TDS మార్గదర్శకాలు వెల్లడించిన IT డిపార్ట్మెంట్.. కొత్తగా వచ్చిన మార్పులివే..
కొత్త TDS నిబంధనల వర్తింపునకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాపారం లేదా వృత్తిలో ప్రయోజనాలను పొందడానికి సంబంధించిన టీడీఎస్ మార్గదర్శకాలనుప్రత్యక్ష పన్నుల శాఖ నోటిఫై చేసింది.
ఈ బెనిఫిట్స్ క్యాష్ రూపంలో లేదా వస్తుసేవల (in kind) రూపంలో ఉండవచ్చు లేదా పాక్షికంగా ఈ రెండు మార్గాల్లో ఉండవచ్చని ట్యాక్స్ బోర్డు తెలిపింది. ఫైనాన్స్ యాక్ట్ 2022 ప్రకారం ఆదాయ పన్ను చట్టం, 1961లో కొత్త సెక్షన్ 194R యాడ్ అయింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(niramala sitaraman) ఈ సెక్షన్‌ను నోటిఫై చేశారు.
కొత్త సెక్షన్ ప్రకారం.. రెసిడెంట్‌కు ఏదైనా బెనిఫిట్ అందించడానికి బాధ్యత వహించే వ్యక్తి, దాన్ని అందించే ముందు, బెనిఫిట్ విలువలో 10 శాతం టీడీఎస్ మినహాయించాలని CBDT ఆదేశించింది. జూన్ 16, గురువారం నాడు జారీ చేసిన నోటీసులో ఈ వివరాలు పేర్కొంది. కొత్త నిబంధన వచ్చే నెల నుంచి, అంటే జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఫైనాన్స్ యాక్ట్ 2022లోని సెక్షన్ 28 క్లాజ్ (iv) ప్రకారం.. గ్రహీత వద్ద బెనిఫిట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుందా లేదా అనేది పన్ను చెల్లింపుదారులు తనిఖీ చేయాల్సిన అవసరం లేదని CBDT తెలిపింది.
ఇన్సెంటివ్స్ అందించే సెల్లర్‌కు కూడా సెక్షన్ 194R వర్తిస్తుందని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. రాయితీలు, డిస్కౌంట్లు కాకుండా.. క్యాష్ లేదా కైండ్ రూపంలో ఉన్న ఐటెమ్స్‌కు ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో కారు, టీవీ, కంప్యూటర్లు, బంగారు నాణెం, మొబైల్ ఫోన్లు, కుటుంబ సభ్యులకు ప్రాయోజిత పర్యటనలు, ఉచిత టిక్కెట్లు, మెడికల్ శాంపిల్స్ వంటివి ఉన్నాయి.
ఒక ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడికి ఒక కంపెనీ ఫ్రీ శాంపిల్‌ను పంపిణీ చేయడంపై కూడా సెక్షన్ 194R వర్తిస్తుందని CBDT పేర్కొంది. వైద్యుడు ఆసుపత్రిలో ఉద్యోగి అయినందున అతనికి ప్రయోజనం అందింనందువల్ల కంపెనీ ట్యాక్స్ డిడక్ట్ చేస్తుంది. "సెక్షన్ 17 ప్రకారం.. ఆసుపత్రి ఉద్యోగులకు అందిన ప్రయోజనం/అనుకూలతను తమ ఉద్యోగులకు అందించిన perquisiteగా పరిగణించవచ్చు. ఈ సందర్భంలో చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం ట్యాక్స్ డిడక్ట్ చేయవచ్చని మార్గదర్శకాలు వెల్లడించాయి. 'ఇక్కడ ఆసుపత్రి చేతుల్లో ట్యాక్స్ విధించడంగా కనిపిస్తున్నా, తర్వాత ఉద్యోగి శాలరీ ఎక్స్‌పెండీచర్‌గా డిడక్షన్ పొందవచ్చు. అందువల్ల అంతిమంగా ఆ మొత్తంపై ఉద్యోగికే ట్యాక్స్ వర్తిస్తుంది, ఆసుపత్రికి కాదు' అని CBDT తెలిపింది.
Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లొచ్చు
ఆర్థిక సంవత్సరంలో రెసిడెంట్‌కు అందే ప్రయోజనం లేదా పెర్క్విజిట్ విలువ లేదా మొత్తం విలువ రూ. 20,000 మించనట్లయితే, ఈ మినహాయింపు చేయాల్సిన అవసరం లేదని CBDT స్పష్టం చేసింది.
0 Comments:
Post a Comment