నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.నీ దిష్టి, నా దిష్టి..థూ అంటూ దిష్టి తీస్తారు.ఆటోలు, లారీల వెనకాల నన్ను చూసి ఏడవకురా లాంటి వాక్యాలు రాస్తారు.
మనందరిలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు.
అన్ని సార్లూ ఒకలా ఉండవు. మనలో ప్రవహించే విద్యుత్ కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది. కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది.
కొందరి ఆలచనాసరళి లాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి. ఆ చూపు మేలు చేస్తుంది. ఎక్స్ రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు.
కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. నరదృష్టి తొలగిపోవాలంటే.. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు.
సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది.
శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటినీ తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది.
ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
అమావాస్య పౌర్ణమి రోజు ఇంటికి దిష్టి తీసి గుమ్మం దగ్గర నిమ్మకాయను కోసి గుమ్మానికి ఇరువైపులా పెట్టడం, గుమ్మడికాయతో దిష్టి తీయడం వల్ల ఇంటి పై ఏర్పడిన నరదృష్టి తొలగిపోయి ఏవిధమైనటువంటి సమస్యలు తలెత్తవని పండితులు తెలియజేస్తున్నారు.
0 Comments:
Post a Comment