NABARD Recruitment 2022: నాబార్డులో స్పెషలిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
NABARD Specialist Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉన్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)..
ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్టు పోస్టుల (Specialist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: స్పెషలిస్టు పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 62 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: జూన్ 14న విడుదలకానున్న వివరణాత్మక నోటిఫికేషన్‌లో అర్హతలు, దరఖాస్తు రుసుము, జీత భత్యాలు వంటి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 14, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30, 2022.
0 Comments:
Post a Comment