🌼మునిసిపల్ టీచర్ల బదిలీలకు బ్రేక్
మరో నెల వాయిదా
డెప్యుటేషన్ , రేషనలైజేషన్ జరగనందుకే .. ?
టీచర్ల బదిలీలకు ముందు డెప్యుటేషన్లు రద్దు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి . వాటి రద్దు తరువాత రేషనలై జేషన్ జరగాలనే వాదన వినిపిస్తోంది . అది జరి గితే పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి .. ? ఏయే స్కూళ్లలో ఎన్ని పోస్టులున్నాయి .. ? అనేది స్పష్టం గా తెలిసిపోతుంది . కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రే షన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇటు డెప్యుటే షన్లు రద్దు చేయలేదు ... అటు రేషనలైజేషన్ జరగలేదు . దీంతో వేకెన్సీ పోస్టులపై స్పష్టత రాకపో వడంతోనే మున్సిపల్ టీచర్ల బదిలీలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది . ఈ క్రమంలోనే అధిక శాతం మంది బదిలీలకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం . ఇప్పుడు బదిలీలు చేపడితే అంతర్గత మున్సిపాలిటీల బదిలీలు చేస్తారా ... ? లేక జిల్లా యూనిట్‌గా పరిగణించి బదిలీ చేస్తారా .. ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి . మరో ప్రధాన సమస్య ఏంటంటే చాలా మంది టీచర్లు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న వారవు తారు . ఒక మున్సిపాలిటీలో 260 మంది టీచర్లు ఉన్నారనుకుంటే వారిని బదిలీ చేసిన మున్సిపా లిటీలో 200 మందే ఉంటే మరో సమస్య ఉత్పన్న మవుతుంది . కచ్చితంగా అంతమందినే కేటాయిం చడం ఇబ్బందవుతుంది . వీటన్నింటినీ లెక్కలోకి తీసుకొని బదిలీలపై నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది .
0 Comments:
Post a Comment