Mixed Vegetable: ఇడ్లీ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే ఒక్క ముక్క కూడా వదలరు..!
Mixed Vegetable: ఇడ్లీ మనం తీసుకునే అల్పాహారాలలో ఒకటి.. ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇడ్లీ తినడానికి కొంతమంది ఇష్టపడరు..
అలాగే ప్రతిసారి మామూలు ఇడ్లీలానే కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకునే వారి కోసమే మిక్స్డ్ వెజిటేబుల్ ఇడ్లీ.. ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!
mixed Vegetable Idly Preparation Procedure
మిక్సిడ్ వెజిటేబుల్ ఇడ్లీ తయారీ విధానం..
ఇడ్లీ పిండి రెండు కప్పులు, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు అర కప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, బీన్స్ ముక్కలు అరకప్పు, బీట్ రూట్ ముక్కలు అరకప్పు.
ఇడ్లీ పిండి లో సన్నగా తరిగిన క్యారెట్ , బీట్ రూట్, బీన్స్, క్యాప్సికం, ముక్కలు వేసి బాగా కలపాలి. ఇందులో చిటికెడు ఉప్పు కాస్త జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సాధారణంగా ఎలా అయితే ఇడ్లీ పెట్టుకుంటామో అలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకుని.. ఇడ్లీ పాత్రలో పెట్టి పది నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. అంతే మిక్సిడ్ వెజిటేబుల్ ఇడ్లీ రెడీ..
mixed Vegetable Idly Preparation Procedure
లేదంటే ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి అందులో పైన చెప్పుకున్న ముక్కలు అన్నింటినీ కలుపుకుని.. ఆ ముక్కలను ముందుగా ఇడ్లీ రేకుల పై కొద్దిగా పెట్టి వాటిపైన ఇడ్లీ పిండి పెట్టుకోవాలి. ఇక మామూలుగానే ఇడ్లీ ఉడికించుకోవాలి. ఈ రెండింటిలో మీకు ఎలా నచ్చితే అలాగా మిక్సిడ్ వెజిటేబుల్ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. ఈ వేడి వేడిగా ఈ ఇడ్లీలోకి కరివేపాకు కారం, కొబ్బరి పచ్చడి, పుదీనా చట్నీ, పల్లి పచ్చడి తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది.
0 Comments:
Post a Comment