Male Health Issues: పురుషులు, స్త్రీల శరీరం విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా భిన్నంగా ఉంటాయి.
అయితే ప్రస్తుతం మహిళతో పోలిస్తే పురుషులే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పురుషులు వారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం మగవారిలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటి పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డిప్రెషన్:
డిప్రెషన్‌కు సాధారణంగా మహిళల కంటే ఎక్కువగా పురుషులలోలే గురవుతున్నారు. మగవారు రోజూ జరిగే నష్టాలను వారిలో వారే దాచుకోవడం వల్ల ఈ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
అయితే ఏవైన సమస్యలుంటే సన్నిహితులతో పంచుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గుండె జబ్బులు:
ప్రస్తుతం చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులు స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా ప్రమాదంగా మారుతున్నాయి. మగవారిలో అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉత్పన్నం కావడంతో ఇలాంటి సమస్యలు అధికంగా నమోదవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
మధుమేహం:
స్త్రీలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా చెడు నూనె పదార్థాలను బయట తింటున్నారు. దీని కారణంగా వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి.. మధుమేహానికి కారణం అవుతోంది.
అందుకే కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తినడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాలేయ వ్యాధి:
ప్రస్తుతం పురుషులు అధిక మొత్తంలో మద్యపానం సేవించడం వల్ల కాలేయం సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దీని తర్వాత శరీరంలో అవయవాలు అన్ని చెడిపోయి.. ప్రాణాంతకంగా మారుతోంది.
ఊపిరితిత్తుల వ్యాధి:
స్త్రీల కంటే పురుషులు క్రమం తప్పకుండా ధూమపానం చేస్తున్నారు. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
0 Comments:
Post a Comment