✍️స్కూళ్లు తెరిచేనాటికే విద్యాకానుక
♦అందించేందుకు విద్యాశాఖ కసరత్తు
♦దాదాపు రూ. 750 కోట్లకుపైగా ఖర్చు
♦పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిట్లు
*🌻అమరావతి, ఆంధ్రప్రభ*: రాష్ట్రంలో పాఠశాలలు తెరవగానే విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక కిట్లను అందించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు. చేస్తోంది. అందుకోసం వేసవి సెలవులు ముగిసేలో గానే కిట్లను సిద్ధం చేసి, ఎంఈవో కార్యాలయాలకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే విద్యార్థులపై భారం పడకుండా ఉండేందు కు యూనిఫాం, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, బెల్టు, బ్యాడ్జి, బ్యాగ్, షూస్, సాక్సు, నిఘంటువు తదితర వస్తువులను 'జగనన్న విద్యాకానుక కిట్లుగా ప్రభు త్వం అందిస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లు. గా కోవిడ్ కారణంగా విద్యాసంవత్సరం కొద్ది నెలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో విద్యాకానుక కిట్లను సిద్ధం చేసి, అందించగలిగారు. ఈ ఏడాది సకాలంలో విద్యాసంవత్సరం ప్రారంభం కానుండ టంతో అందుకనుగుణంగా సెలవుల్లోనే టెండర్లు. ఖరారు చేసి, కిట్లను సిద్ధం చేస్తోంది.
♦గతేడాది కన్నా ఎక్కువ కిట్లు..
రాష్ట్రంలో ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి, పలు పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏటా కిట్ల సంఖ్య పెంచాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాకానుక పథకాన్ని ప్రారంభించగా... తొలి రెండేళ్ల కన్నా ఈ ఏడాది మరిన్ని కిట్లు అదనంగా సిద్ధం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతేడాది రూ. 731 కోట్లు వ్యయం చేసి, 47 లక్షల 32 వేల 64. విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందించింది. తొలుత 44 లక్షల కిట్లకు అంచనాలు రూపొందించినప్పటికీ.. తర్వాత పెరిగిన విద్యార్థుల సంఖ్య దృష్ట్యా అదనంగా కిట్లను సిద్ధంచేసి, అందించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్ల అడ్మిషన్ల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాల తో దాదాపు 49 లక్షల కిట్లను సిద్ధం చేయాలని అంచనా వేసినట్లు సమాచారం. అలాగే వీటి కోసం నిధులను కూడా పెంచుతున్నట్లు తెలిసింది.
♦అందుబాటులోకి ప్రత్యేక యాప్..
అన్ని జిల్లాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి విద్యా కానుక కిట్లను సరఫరా చేసేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా జిల్లాల విద్యాశాఖాధికారులు అవసరమైన ఇండెంట్ ను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష పరిధిలోని అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్లు, కమ్యూని టీ మొబిలైజేషన్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో అవసర మైన కిట్ల ఇండెంట్‌ను తెలపాలని కోరింది. అలాగే ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగనన్న విద్యాకానుక 2022-23 యాప్‌లో వివరాలు పొందు పరచాలని సూచించింది. ఈ నెల మూడో తేదీలోగా ఏపీసీ, సీఎంవోలు హెడ్ మాస్టర్ల ద్వారా తీసుకున్న " సమాచారంతో ఇండెంట్ పంపాలని స్పష్టం చేసింది. ఆ ఇండెంట్ కు అనుగుణంగా ఇప్పటికే సెంట్రలైజ్డ్ టెండర్ల ద్వారా ఖరారు చేసిన ప్రకారం కిట్లను జిల్లాల కు సరఫరా చేయనుంది.
0 Comments:
Post a Comment