అడ్మిషన్లపై దృష్టి సారించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
ఒంగోలు(విద్య). జూన్ 18 : జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కొత్తగా 18 బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది.
వాటిలో విభజిత ప్రకాశం జిల్లాకు తొమ్మిది, బాపట్ల జిల్లాకు తొమ్మిది ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలను ప్రారంభంకానున్నాయి.
ప్రధానంగా టెన్త్ పాసైన తర్వాత బాలికల్లో డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ జూనియర్ కళాశాలలను మంజూరుచేసింది.
హైస్కూళ్ల ఆవరణలోనే ఏర్పాటు
జిల్లాకు మంజూరైన కళాశాలలను హైస్కూళ్ల ఆవరణలోనే ఏర్పాటు చేయనున్నారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చీమకుర్తి మండలం దేవరపాలెం, గిద్దలూరు ఇంకొల్లు, జె.పంగులూరు మండలం బూదవాడ, కారంచేడు మండలం కుంకలమర్రు, కొండపి మండలం కె.ఉప్పలపాడు, కొరిశపాడు మండలం రావినూతల, మద్దిపాడు మండలం కారుమూడివారిపాలెం, మార్టూరు మండలం వలపర్ల, నాగులుప్పలపాడు మండలం హెచ్ నిడమానూరులలో ఏర్పాటు చేయనున్నారు.
ఒంగోలు మండలం కరవది, పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం, సింగరాయకొండ మండలం పాకల, టంగుటూరు మండలం కొణిజేడు, వేటపాలెం, యద్దనపూడి మండలం ద్రోణాదుల, సంతనూతలపాడు మండలం మైనంపాడులో ఈ కళాశాలలను ప్రారంభించనున్నారు.
అడ్మిషన్లపై దృష్టిపెట్టండి: కలెక్టర్
జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న బాలికల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టాలని డీఈవో విజయభాస్కర్, ఆర్ఐవో సైమన్ విక్టర్‌ను కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు.
టెన్త్ పాసైన బాలికలకు టీసీలు జారీచేయకుండా వారిని ఒప్పించి కొత్త కళాశాలల్లో చేర్పించాలని సూచించారు.
విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇతర సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.
0 Comments:
Post a Comment