Jio Best Plan: జియో మరో సంచలన ప్లాన్.. రూ.395కే అన్ లిమిటెడ్ బెనిఫిట్స్.. ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీతో.. వివరాలివే
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అనేక సరికొత్త ప్లాన్లను తీసుకువస్తోంది.
తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్లను అందించడానికి జియో ఎప్పటికప్పుడు తన ప్లాన్లను అప్ డేట్ చేస్తూ ఉంటోంది. అయితే ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలు 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs.395 Plan: మిగతా టెలికాం కంపెనీలతో పోల్చితే అత్యంత తక్కువ రూ. 395కే 84 రోజుల పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్ ను అందిస్తోంది జియో. ఈ ప్లాన్ తో 6GB డేటా లభిస్తుంది. 1000 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. డేటా తక్కువగా వాడే వారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs.719 Plan: ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత SMSలు మరియు Jio యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs.666 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీతో నిత్యం 1.5 జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 126GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ లభిస్తుంది. దీంతో పాటు, రోజువారీ 100 ఉచిత SMSలు లభిస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs 296 Plan: 30 రోజుల వ్యాడిటీతో ఈ ప్లాన్ ను అందిస్తోంది జియో. ఎంచుకున్న వినియోగదారులకు 25 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు నిత్యం 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment