Jana Gana Mana, చూడదగిన సినిమా !
"""""""""""""""""""""""
ఒరిజినల్ గా మలయాళం మూవీ, Netflix లో, తెలుగులో కూడా.. Jana 2022 పేరుతో ఉంది., మిస్ అవకుండా చూడండి.
సిటీ కి దూరంగా రోడ్డు పక్కన మొత్తం కాలిపోయిన ఒక ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఒక అమ్మాయి శవం దొరుకుతుంది, రేప్ చేసి చంపి ఉండచ్చు అని ఫోరెన్సిక్ రిపోర్ట్.
దేశం మొత్తం ఆ న్యూస్ అవుతుంది, మీడియా సోషల్ మీడియా ఎక్కడ చూసినా అదే అమ్మాయి న్యూస్ .
ఒక సిన్సియర్ పోలీసు ఆఫీసర్ కి ఆ కేస్ అప్పచెప్తారు, ఒక నలుగురిని అనుమానం తో అరెస్ట్ చేస్తారు, కానీ సరి అయిన ఆధారాలు ఎం ఉండవు, జనాల్లో నుంచి స్టూడెంట్స్ నుంచి విపరీత మైన ఆందోనలు మొదలు అవుతాయి.
పై ఆఫీసర్స్ ఆ సిన్సియర్ ఆఫీసర్ ని తప్పించాలి అనుకుంటారు, ఆ ఆఫీసర్ వారిని వేరే స్టేషన్ కి తీసుకెళ్లే సమయంలో ఎన్కౌంటర్ చేస్తాడు.
ఒక్కసారిగా దేశంలో పండగ వాతావరణం మొదలు అవుతుంది, పోలీసు లకి జేజేలు పలుకుతారు జనం.
ఇప్పుడే అసలైన సినిమా మొదలు అవుతుంది. ఎన్కౌంటర్ కేస్ కోర్ట్ కి వస్తుంది. పోలీస్ ఆఫీసర్ కి సపోర్ట్ గా జనాలు, స్టూడెంట్స్ వస్తారు.
కోర్ట్ లో వాదనలు మొదలు అయ్యాక ట్విస్ట్ ల ట్విస్ట్ లు ఇస్తాడు. అప్పటి వరకు సినిమాలో మనం అనుకున్న వి అన్ని తప్పే మనల్ని సినిమాలో లీనం అయ్యేలా చేసాడు డైరెక్టర్
లాయర్ గా పృధ్వీరాజ్ నటన మాత్రం అద్భుతం అని చెప్పచ్చు.
ట్విస్ట్ లు చెప్తే చూసే టప్ప్పుడు ఫీల్ ఉండదు, అందుకే ఎం చెప్పడం లేదు.
పేపర్ లలో మీడియా లో మనం చూస్తున్న వార్తల వెనుక కనిపించని ఇంకో కోణం ఉంటుంది. అలాగే ప్రతి వార్త కి ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు.
సత్వర న్యాయం , instant justice ని రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారో బాగా చూపించారు . దిశ కేసు లాంటి కేసు , సజ్జనార్ పాత్ర లాంటి పాత్ర , మీడియా ఓవరాక్షన్ , సెంట్రల్ యూనివర్సిటీలలోని politics of colour , caste and discrimination వగైరా అన్నీ ఉన్నాయి
****
ఈ సినిమా ని మిస్ అవ్వకుండా చూడండి.. Netflix లో తెలుగు లో కూడా ఉంది..
కింది లింక్ లో సినిమా చూడండి....
https://ww13.ibomma.bar/a/jana-gana-mana-telugu-2022-f2ysu-watch-online.html
0 Comments:
Post a Comment