India Post GDS Results 2022: ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ - 2022 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
India Postal GDS Results 2022: భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్ విభాగంలో దేశ వ్యాప్తంగా గ్రామీణ్ డాక్ సేవక్ (Gramin Dak Sevak Posts) పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి.
రాత పరీక్ష లేనందున దరఖాస్తు ప్రక్రియ పూర్తవగానే.. అభ్యర్ధుల అకడమిక్ మెరిట్ ఆధారంగా ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులు జూన్ 30వ తేదీలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వవలసి ఉంటుంది. అనంతరం భారత పోస్టల్ విభాగం మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తుంది. కాగా మొత్తం 38,926ల పోస్టుల భర్తీకి మార్చి 2 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్ధుల ఎంపిక ఆధారంగా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (GDS), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను కేటాయిస్తారు.
India Post GDS Result 2022 ఎలా చెక్ చేసుకోవాలంటే..
ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.in ను ఓపెన్ చెయ్యాలి.
హోమ్ పేజ్‌లో కనిపించే ‘Shortlisted Candidates’ లింక్ పై క్లిక్ చెయ్యాలి.
అభ్యర్ధికి సంబంధించిన సర్కిల్‌ను ఎంపిక చేసుకోవాలి.
ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
సేవ్ చేసుకుని హార్డ్‌కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.
meeru AP వి వస్తే చెప్పండి సార్ ఏవో ఇతర రాష్ట్రాలవి కాదు postel result
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSir దీని తర్వాత ఇంకో notificationవచ్చింది కదా, దాని ఫలితాలు ఇంకా రావలసి ఉంది కదా ?
ReplyDelete