India Post GDS Recruitment 2022: Apply for 38,926 Vacancies for Gramin Dak Sevak Across India
పోస్టల్ డిపార్ట్ మెంట్ లో 38926 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు.తెలంగాణ-1226, ఆంధ్రప్రదేశ్-1716 .
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు
1) బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)
2) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)
3) డాక్ సేవక్
మొత్తం ఖాళీలు: 38926
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:
తెలంగాణ-1226
ఆంధ్రప్రదేశ్-1716.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: టైం రిలేటెడ్ కంటిన్యూటీ ఆలవెన్స్ (టీఆర్ సీఏ) ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు.
1) బీపీఎం పోస్టుకు 4 గంటల టీఆర్ సీఏ స్లాబ్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు.
2) ఏబీపీఎం / డాక్ సేవక్ పోస్టులకు 4 గంటల టీఆర్ సీఏ స్లాబ్ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022.
దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022.
0 Comments:
Post a Comment