IIIT - మెరిట్ ప్రకారమే ట్రిపుల్ ఐ టీ సీట్ల భర్తీ
✍️మెరిట్ ప్రకారమే ట్రిపుల్ ఐ టీ సీట్ల భర్తీ
♦️నోటిఫికేషన్ విడుదలైందంటూప్రచారం
♦️ఇంకా జారీచేయలేదంటూ ఆర్జీయూకేటీ స్పష్టత
♦️తెలంగాణ పది ఫలితాలవిడుదల తర్వాతే నోటిఫికేషన్
🌻అమరావతి,ఆంధ్రప్రభ*:రాష్ట్రంలోని నాలుగు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ) ల్లో సీట్లభర్తే మెరిట్ ప్రకారమే జరగనున్నాయి. గత రెండేళ్లు విడ్ కారణంగా పదో తరగతి పరీక్షలు జరగకపోవడంతో ప్రత్యేకంగా జీవో విడుదల చేసి, ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధా రంగా సీట్ల కేటాయింపు చేపట్టారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించడంతో ఆ ఫలితాల మెరిట్ ప్రాతిపదికనే సీట్లు కేటాయించనున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయినా సీట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరోవైపు నోటిఫికేషన్ విడుదలై సీట్ల భర్తీ ప్రారంభం అవుతున్నట్లుగా సమాచారం షేర్ అవుతుండటంతో ఆర్జీయూకేటీ స్పందించింది. ఆ సమాచారం పూర్తిగా ఫేక్ అని, 2022-23 సంవత్సరానికి గాను ఆర్అయూకేటీ కార్యలయం ఎటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్లు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఆర్జీ యూకేటీ పేరుతో సర్క్యులేట్ అవుతున్న నకిలీ అడ్మిషన్ నోటిఫికేషన్లను ప్రజలు గమనించవద్దనిచాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి సూచించారు. విశ్వవిద్యాలయం నిర్ణీత సమయంలో అడ్మిషన్ నోటిఫికేషన్లు జారీ చేస్తుందని, ఆ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తామని, అలాగే విశ్వవిద్యాలయ వెబ్సైట్ ఆర్జీయూకేటీ.ఐఎన్ లో ఉంచుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో తెలంగాణ విద్యార్ధులకు 15 శాతం కోటా ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వ రలో తెలంగాణలోనూ పదో తరగతి ఫలితాలు విడు దలైన తర్వాతే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
♦️మరో వారం తర్వాతే ఇంటర్ ఫలితాలు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలకు మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ దాదాపుగా పూర్తయినా.. డేటా నమోదు, పరిశీలనకు కొంత సమయం పట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల రెండో వారంలో ఫలితాలు వెల్లడిస్తామని చెప్పినా.. మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడం తో మరో వారం రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నట్లు చెబు తున్నారు. ఇదిలా ఉంటే.. పదో తరగతి ఫలితాలు వెలువడి వారం రోజులు దాటడంతో ఉత్తీర్ణులైన విద్యార్థులు. ఇంటర్మీ డియట్‌లో తమకు నచ్చిన గ్రూపులో చేరడానికి సన్నద్ధం అవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంటర్ అడ్మిషన్లపై ఇంతరవరకూ ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ప్రవేశాలను గతేడాది మాదిరిగా ఆన్లైన్లో చేప ట్టే ఏర్పాట్లు చేస్తారా లేక ఆఫ్‌లైన్‌లో చేపడతారా? అనే అంశంపై స్పష్టత రాలేదు. మరోవైపు కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు ఇప్పటికే ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్లు చేపడుతున్నాయి. విద్యార్ధులు తర్వాత వేరే కళాశాలల వైప చూడకుండా అప్లికేషన్ ఫీజుల పేరుతో వసూళ్లు చేస్తున్నా యి, పేరున్న కళాశాలలు సీట్ల భర్తీ అయిపోతోందని, త్వరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, సీట్లు రిజర్వ్ చేసుకోవాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిళ్లు తెస్తున్నాయి.
దీంతో ఆందోళనకు గురవుతున్న కొందరు కళాశాలలు సూచిస్తున్న మేరకు ఫీజులు చెల్లిస్తున్నాయి. అయితే బోర్డు నుంచి అడ్మిషన్ల విషయంలో స్పష్టత రాకుండానే ఈ ప్రక్రియ కొనసాగిస్తుం డటంతో.. తర్వాత ఆన్లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. కట్టిన ఫీజులు నష్టపోయే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని కళాశాలలైతే ఏకంగా తరగతులనూ ప్రారంభిస్తున్నాయి. ప్రభుత్వం అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వకముందే కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఇలాంటి వ్యవహారాలు నిర్వహిస్తున్నా యని రెండేళ్ల కిందటే ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల కాకుండా ఎవరూ అడ్మిషన్లు చేపట్టకూ డదని, తరగతులు నిర్వహించకూడదని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేయవద్దని, అలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం సహా అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు చేపట్టాలని గతేడాది ప్ర భుత్వం ఆదేశించింది. అనంతరం సీటు కేటాయించిన కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అడ్మిషన్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
0 Comments:
Post a Comment