Hot Water: పరగడుపున గ్లాసు వేడి నీరు తాగండి.. ఈ వ్యాధులని తరిమి కొట్టండి..!
Hot Water: మీరు ఉదయాన్నే వేడినీరు తాగే అలవాటును కోల్పోయినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అలవాటును తిరగి ప్రారంభించవచ్చు.
నిద్ర లేవగానే టీ, కాఫీలకు నో చెప్పాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
చాలా మంది టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించేందుకు ఇష్టపడతారు. కానీ మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించినట్లయితే అది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి టీ లేదా కాఫీ తాగే అలవాటు మానేయడం మంచిది. రోజూ ఉదయం వేడినీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది. వేడినీళ్లు తాగిన తర్వాత ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మారుతున్న సీజన్లో ఫిట్‌గా ఉండటానికి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాస్ గోరువెచ్చగా తాగాలి. వీలైతే అందులో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
గోరు వెచ్చని నీరు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైపీబీ తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు రక్త సరఫరా మెరుగుపడటంతో శిరోజాలకు పోషకాలు అందుతాయి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా పెరుగుతాయి. నిత్యం గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. గొంతు సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ఉపయోగంఉంటుంది. దగ్గు, జలుబు లాంటి చిన్న చిన్న సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
0 Comments:
Post a Comment