High Protein Sweets: ప్రోటీన్ రోజువారీ ఆహారంలో ఒక అంతర్భాగం. ఇది కండరాలు, కణజాలాలను మెరుగుపరిచి వీటి నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది.
సాధారణంగా చాలా మంది ప్రొటీన్లైన..మాంసం, కోడిగుడ్లు వంటి మాంసాహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటారు. అయితే శాకాహారులు ప్రొటీన్ అవసరాలను ఎలా తీర్చుకోవాలో ఈ కథనంలో తెలుసుకోవచ్చు. చాలా మంది మాంసం తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ ఐదు రకాల స్వీట్లను తీసుకుంటే శరీరంలో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఆ స్వీట్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బేసన్ లడ్డు (Besan ke Laddu) :
బేసన్ లడ్డులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఫోలేట్ అని కూడా అంటారు. దీని సహాయంతో గుండెలోని సిరలలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి.
ఖీర్ (Kheer):
ఖీర్ తయారీలో అధికంగా పాలను, నెయ్యిని వినియోగిస్తారు. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.అంతేకాకుండా ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి.
కొంతమంది దీనిని తయారు చేయడానికి బెల్లం కూడా ఉపయోగిస్తారు. కావున ఇది ఆరోగ్య విలువను పెంచుతుంది.
మిల్క్ కేక్(Milk Cake):
మిల్క్ కేక్‌ను పాల నుంచి తయారు చేస్తారు. ఈ డెజర్ట్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రోటిన్లు లభిస్తాయి. అంతేకాకుండా దీనిని రిచ్ ప్రొటీన్ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. కాబట్టి ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
మిష్టి దోయి(Mishti Doi):
మిష్టి దోయిని పెరుగు, బెల్లం ఉపయోగించి తయారు చేస్తారు. కావున ఇందులో చాలా రకాల ప్రోటీన్లు ఉంటాయి. మిష్టి దోయిని తినడం వల్ల జీర్ణక్రియలో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మూంగ్ దాల్ హల్వా (Moong Dal Halwa)
భారత్‌లోని ప్రతి వంటగదిలో మూంగ్ దాల్‌ను వినియోగిస్తారు. అంతేకాకుండా దీనితో హల్వా కూడా తయారు చేస్తారు. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. కావున BP రోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతుంది.
0 Comments:
Post a Comment