Healthy Kidney: మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే..ఇవాళ్టి నుంచే ఇవి అలవాటు చేసుకోండి
Healthy Kidney: చెడు జీవనశైలి కారణంగానే వివిధ రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇందులో ముఖ్యమైంది కిడ్నీ సమస్య. కొన్ని రకాల ఆరోగ్య అలవాట్లతో కిడ్నీ సమస్యను దూరం చేసుకోవచ్చు..
ఆధునిక పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులతో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. అందులో కొన్ని తీవ్రమైనవి. కొన్ని రకాల ఆలవాట్లతో ప్రమాదకరమైన కిడ్నీ సమస్య కూడా దూరమౌతుంది. కిడ్నీ ఒక్కటే కాదు శరీరంలో ప్రతి అంగం కీలకమే. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ బాధ భరించలేనిదిగా ఉంటుంది. ఇప్పుడు కీలకమైన కిడ్నీ సమస్య గురించి తెలుసుకుందాం.
కిడ్నీ అనేది శరీరంలో ఒక ముఖ్యమైన అంగం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. విష వ్యర్ధాల్ని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. కిడ్నీ పనితీరులో ఇబ్బంది ఏర్పడితే..ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. క్రమంగా క్రానిక్‌గా మారవచ్చు. నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీ సమస్య ప్రాణాంతకమౌతుంది. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే నియంత్రించవచ్చు. కొన్ని అలవాట్లతో కిడ్నీను ఆరోగ్యవంతంగా చేయవచ్చు.
కిడ్నీని ఆరోగ్యవంతంగా చేయడమెలా
మనం రోజూ తినే వంటల్లో, ఆహార పదార్ధాల్లో వైట్ సాల్ట్ స్థానంలో పింక్ సాల్ట్ వాడటం అలవాటు చేసుకోవాలి. సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్‌లో సోడియం తక్కువగా ఉంటుంది. శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచాలి. ముఖ్యంగా పరుగు లేదా వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అలవాటుగా మారాలి. రోజుకు కనీసం 10-12 గ్లాసుల నీళ్లు తాగాలి. అవసరమైన మోతాదులో నీరు తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. నీటి కొరత కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. పోషక గుణాలుండే ఆహార పదార్ధాలు లేదా పండ్లను డైట్లో చేర్చుకోవాలి. గ్రీనీ వెజిటెబుల్స్ దోహదపడతాయి. పచ్చని కూరగాయల్లో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
0 Comments:
Post a Comment