Health: కాళ్లు, చేతులు తిమ్మర్లు వస్తే ఆలస్యం చేయొద్దు సుమా..
అప్పుడప్పుడు కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం మధుమేహులకు చిరపరిచితమే..కానీ మధుమేహం లేకపోయినా తిమ్మిర్లు, మంటలు, నీరసం, నిస్సత్తువ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే.
ఇది మల్టీఫుల్ స్ల్కీరోసిస్ కావొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. నరాలపై మైలిన్ పొర దెబ్బతినడంతో ఈ సమస్య వస్తుందని న్యూరో ఫిజిషియన్ సుబ్బయ్యచౌదరి పేర్కొన్నారు.
మెదడుకు నిత్యం సమాచారం
మన శరీరంలోని నాడీ వ్యవస్థలో అద్భుతమైన సమాచార వ్యవస్థ ఉంటుంది. రక్తప్రసరణ వ్యవస్థ శరీరమంతటికి ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. శరీరంలోని వ్యర్థాలు, మలినాలు, కార్బన్ డై అక్సైడ్‌ను బయటకు పంపిస్తుంది. నాడీ వ్యవస్థ కండరాలు, అవయవాల నుంచి నాడుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తు మెదడుతో ఆజ్ఞలను పంపుతుంది. నరాలతో మెదడుకు నిత్యం సమాచారం వెళ్తుంటుంది. ఈ నరాల చుట్టూ మైలిన్ పొర కప్పి ఉంటుంది. ఈ పొర దెబ్బ తినడంతోనే మల్టీఫుల్ స్ల్కీరోసిస్ అంటారు.
మైలిన్ పొర పోవడంతో
ఈ పొర పోవడంతో కొంతమందికి చూపు తగ్గుతుంది. కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం, నడక తడబడటం, మూత్ర సంబంధ సమస్యలు వస్తాయి. కొంతమందికి సెక్స్ సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. శారీరకపరమైన ఇబ్బందులే వస్తాయి గానీ ప్రాణాంతకం మాత్రం కాదు.
చికిత్స ఎలా ఉంటుంది
రోగి స్థితిని పరిశీలించిన తర్వాత ఎంఆర్‌ఐ చేయక తప్పదు. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసి పరీక్షించాలి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మల్టీఫుల్ స్ల్కీరోసిస్‌లాగా అనిపిస్తాయి. ఇలాంటి వారికి కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రోగ నిరోధక శక్తి దెబ్బతిన్నపుడుకూడా మైలిన్ పొర పాడవుతుంది. ఈ సమస్య వచ్చిన వెంటనే హైడ్రో స్టిరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతకాలం వాడేలా మందులు ఇవ్వనున్నాం. వీటితో చాలా వరకు వ్యాధి తగ్గిపోతుంది.
0 Comments:
Post a Comment