చీకట్లో టీవీ లేదా ఫోన్ చూస్తే ఎంత డేంజరో తెలుసా.. ఇలా చేశారంటే ఈ జబ్బులొస్తయ్ జాగ్రత్త...
సరిగ్గా నిద్రపోకుండా రాత్రంతా మెలకువగా ఉండటం.. చీకట్లో టీవీ చూడటం, మొబైల్ స్క్రోల్ చేయడం.. వంటివి నేటి తరానికి బాగా అలవాటు అయ్యాయి. మీరు కూడా అదే చేస్తున్నారా?
అలా అయితే మీ ఆరోగ్యం ఎంత డేంజర్ లో ఉందో తెలుసా?
సమయాన్ని గడపడానికి టీవీ (Television)చూడటం చాలా మందికి ఇష్టమైన అలవాటు. ఇక నేటి యువతలో చాలా మంది తెల్లవార్లూ తమ మొబైల్స్ లో స్క్రోలింగ్ చేస్తూ కూర్చుంటారు. ఇలా చేయడం పగటిపూట కంటే నైట్ టైం చీకట్లో చేయడం మీ ఆరోగ్యానికి, మీ కంటి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. క్రమం తప్పకుండా దగ్గరి నుంచి టీవీ చూడటం కంటి సమస్యలకు దారితీస్తుందని సాధారణంగా అందరికీ తెలుసు. అయితే చీకట్లో టీవీ చూడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఒకేలా ఉండవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కంటి చూపును తగ్గిస్తుంది: చీకట్లో కూర్చుని టీవీ చూడటం వల్ల మీ కంటి చూపు తగ్గుతుంది. చీకటి గదిలో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు మీ కళ్లు ఎప్పుడూ వివిధ రకాల కాంతికి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే టీవీలో విజువల్స్ మారే కొద్దీ లైట్ కాంపోజిషన్ (Light Composition)కూడా తగ్గుతుంది. తెరపై దృశ్యం మారిన ప్రతిసారీ లేదా టెలివిజన్ కార్యక్రమం మారిన ప్రతిసారీ.. తెర నుంచి వెలువడే కాంతిలో చాలా పెద్ద మార్పు ఉంటుంది.
డ్రై ఐ సిండ్రోమ్ (Dry eye syndrome) వ్యాధి: నిరంతరం మారుతున్న కాంతి స్థాయిలు (Light levels) మీ కళ్ళపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇది కంటి అలసటకు దారితీస్తుంది. Eye pressure.. పొడి కంటి సిండ్రోమ్ కు (Dry eye syndrome) దారితీస్తుంది, ఇది గ్లకోమా (Glaucoma) ప్రమాదాన్ని పెంచే కారకం.
కంటిలోని రెటీనాకు నష్టం: టీవీ నుంచి వెలువడే కాంతిలో అతినీలలోహిత కిరణాలు (Ultraviolet rays)కొద్ది మొత్తంలో ఉంటాయి. అవి కంటిలోని రెటీనాను దెబ్బతీస్తాయి. గదిలో వెలుతురు ఉంటే అతినీలలోహిత కిరణాలు, కాంతి కిరణాలను కలిసి అవి కంటిపై పడతాయి. దీని వల్ల రెటీనా (Retina)దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది.
అందుకే రాత్రిపూట టీవీ చూస్తున్నప్పుడు గదిలో లైట్ ఆఫ్ చేయకూడదు. టీవీని కనీసం ఐదు అడుగుల దూరం నుంచి చూడాలి. టీవీలో బొమ్మలు కనిపించే స్క్రీన్ యొక్క ఒక మూల నుంచి దానికి ఎదురుగా ఉన్న మూలకు అంటే కర్ణం వెనుక ఉండే దూరాన్ని ఆ టీవీ సైజుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆ సైజును 4తో భాగించినట్లయితే, ఆ టీవీ నుంచి మనం ఎన్ని అడుగుల దూరంలో కూర్చోవాలో ఆ నెంబరు మనకు తెలియజేస్తుంది.
తరచుగా టీవీ చూడటం వల్ల ఈ జబ్బులు వస్తాయి..
టీవీ ఎక్కువ సేపు చూడటం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తాత్కాలికమైన సమస్యగా భావించి లైట్ తీసుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ కొంతసేపు రెస్ట్ తీసుకుంటే ఈ సమస్క తగ్గినట్టుగా అనిపించినా.. రాబోయే రోజుల్లో ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. కంటి అలసట (Eye fatigue), గ్లాకోమా (Glaucoma), ఆస్టిగ్మాటిజం (Astigmatism)తో ఇది ముడిపడి ఉంటుంది. కండ్ల నుంచి నీరు కారడం, కళ్లు మండడం, తలనొప్పి, దృష్టి మసకబారడ వంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
0 Comments:
Post a Comment