బెల్లంలో విటమిన్ బి1, బి6, సి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఎనర్జీ, చక్కెర, కార్బోహైడ్రేట్, సోడియం వంటి అనేక రకాల పోషకాలు బెల్లంలో ఉన్నాయి.
ఈ పోషకాలన్నీ ఏదో ఒక విధంగా మన శరీరానికి మేలు చేస్తాయి.
ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు బెల్లం నీరు వాడితే ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ సమస్యలు దూరమవుతాయి.
ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. వారు నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు ముగించుకొని.. ఖాళీ కడుపుతో బెల్లం నీటిని తాగాలి. ఇలా చేస్తే ఉదయాన్నే సుఖవిరేచనం అవుతుంది.
బెల్లం నీటితో కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా రావు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఉండే మలినాలన్నీ సులభంగా తొలగిపోతాయి.
బెల్లం శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఉదయాన్నే బెల్లం నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీరు బరువు తగ్గుతారు.
బెల్లంలో విటమిన్ సీ ఉంటుంది. దీనిని వేడి నీళ్లలో బెల్లం కలిపి తాగితే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. శరీరాన్ని శాంతపరుస్తుంది.
బెల్లం తినడం వల్ల కాలేయం నుంచి విష పదార్థాలను సులభంగా బయటకు పంపవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీటాక్సిక్ ప్రభావాన్ని కలిగి ఉండే సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి.
మీ శరీరంలో రక్తం తక్కువగా ఉన్నట్లయితే బెల్లం నీటిని తీసుకోవాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి. శరీరంలో తగినంత మోతాదులో ఐరన్ లేకుంటే రక్త హీనత వస్తుంది. ఇది అలసట, బలహీనతకు దారితీస్తుంది.
మీకు బీపీ ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా.. బెల్లం నీటిని తీసుకోవాలి. ఇది బీపిని నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఐరన్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో బెల్లం ముక్క లేదా బెల్లం పొడి వేసి బాగా కలపాలి. ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. బెల్లం నీళ్లలో కలిపి తాగకూడం ఇష్టం లేకపోతే.. బెల్లం ముక్క తిని, ఆ తర్వాత నీటిని తాగవచ్చు. ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల పొట్ట కూడా క్లియర్ అవుతుంది. సుఖ విరేచనమవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment