Health Tips: ఈ రోజుల్లో చాలా మంది పురుషులు ఒత్తిడి, అలసట వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు.
అయితే ఇవి గుండె సమస్యల నుంచి ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఎంతో ప్రమాదకరమైన రోగాలు సైతం సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. అందులోనూ చాలా రోగాలు.. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, అలసట వంటి వాటివల్లే ఎక్కువగా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అందులోనూ ప్రస్తుతం చాలా మంది మగవారు ఒత్తిడి, అలసట వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఇవి చూడటానికి చిన్న చిన్న సమస్యలుగా అనిపించినా.. ఇవి ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తాయి.
అందులోనూ ఈ రోగాలు ఆడవారి కంటే మగవారికే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి, అలసట వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఒత్తిడి (Stress), డిప్రెషన్ (Depression) వంటి సమస్యలు చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీటి వల్ల లిమిట్ దాటి తినే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇది రాను రాను మీరు ఊబకాయం బారిన పడేలా చేస్తాయి. అలాగే ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా విపరీతంగా పెరుగుతుంది.
ఇలాంటి వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. లేకపోతే.. ఒత్తిడి మరింత పెరిగి గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఒంటరిగా ఉండే పురుషులే ఒత్తిడి సమస్యను ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారే గుండెపోటు బారిన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే వీళ్లు ఇతరులతో తరచుగా మాట్లాడుతూ ఉండాలి.
ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు మరింత ఎక్కువ అయినప్పుడు .. క్రమం తప్పకుండా యోగా (Yoga)ను, వ్యాయామాలు (Exercises) చేస్తూ ఉండండి. వీటివల్ల ఒత్తిడి తగ్గుతుంది.
మంచి ఆహారాలు కూడా ఒత్తిడిని, అలసటను, ఆందోళలనను దూరం చేస్తాయి. ఇందుకోసం ఇలాంటి సమస్యలున్న పురుషులు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఫ్యామిలీతో ఎక్కువ సేపు గడిపినా.. ఎలాంటి టెన్షన్ అయినా.. ఇట్టే తగ్గిపోతాయి.
0 Comments:
Post a Comment