ఇంటర్నెట్ డెస్క్: అనుకోని సంఘటనలు విన్నా, చూసినా కొందరు తలనొప్పితో ఇబ్బంది పడతారు. దాన్ని తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులు పాటిస్తారు.
తరచుగా వచ్చే తలనొప్పితో కొన్నిసార్లు మెదడులో నరాలకు ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి తలనొప్పి ఎందుకు వస్తుందో న్యూరో ఫిజిషియన్ సుబ్బయ్య చౌదరి వివరించారు.
తలనొప్పి ప్రైమరీ, సెకండరీగా ఉంటుంది. ప్రైమరీ తలనొప్పి అప్పుడప్పుడు వస్తుంది. ఈ తలనొప్పికి ఏ కారణమూ ఉండదు. సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి.
ఇలాంటి తలనొప్పికి ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని రకాల ఆహారం తిన్నపుడు, డార్క్ చాక్లెట్, రెడ్‌వైన్ తీసుకున్నపుడు, ఎండలో వెళ్లినపుడు, అతిగా శబ్దాలు విన్నపుడు వచ్చే తలనొప్పి ప్రైమరీ తలనొప్పిగా భావించాలి.
మైగ్రెయిన్‌తో చికాకు
జెనెటిక్, వాతావరణంలోని మార్పులతో మైగ్రెయిన్ తలనొప్పి వస్తుంది. రక్త నాళాల్లో మార్పులు రావడంతో ఈ విధంగా జరుగుతుంది. వాంతులు, కంటిచూపు మందగింపు కూడా రావొచ్చు.
పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఈ తలనొప్పి వచ్చినపుడు కాళ్లు, చేతులు లాగినా.. జలుబు చేసినట్టు ఉన్నా వైద్యులను సంప్రదించాలి.
కొన్ని రకాల సంఘటనలతో వచ్చే టెన్షన్‌తో వచ్చే తలనొప్పితో తలంతా పట్టేసినట్టు ఉంటుంది. మెడనొప్పి కూడా వస్తుంది.
ఒత్తిడి, బీపీ ఉన్నపుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సాధారణ నొప్పుల మందులు వాడితే చాలు. ఆహారం, మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగా, ధ్యానం చేస్తే ఫలితం ఉంటుంది.
0 Comments:
Post a Comment