ఈరోజు గుంటూరులో జరిగిన హైస్కూల్ హెడ్ మాస్టర్స్ సమావేశంలో రాబోయే విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరిగా మెరుగుపడాలని కమిషనర్ సురేష్ కుమార్ గారు సూచించడం జరిగింది..
వాట్సాప్ లో సర్కులేట్ అవుతున్న అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం...
విద్యార్థుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఫలితాలు తగ్గాయని సర్కులేట్ చేసుకోవడం సరికాదని... ఉపాధ్యాయులది మాత్రమే పూర్తి బాధ్యత అని.... పరిస్థితులు ఈ సారి మరింత కఠినంగా ఉంటాయని వివరించినట్లు తెలుస్తోంది..
అలాగే వివిధ రకాల యాప్స్ వల్ల సమయం సరిపోలేదని చెప్పడం కూడా సరికాదని వారి అభిప్రాయం...
స్కూల్ పరిధిలో ఇంటర్నల్స్ లో విద్యార్థులకు లేని ప్రతిభ కన్నా ఎక్కువ నమోదు చేస్తూ రావడం వచ్చే విద్యాసంవత్సరం నుంచి చేయవద్దని సూచించారు...
ప్రాథమిక పాఠశాలలో నేర్చుకుని రాలేదు అని అనకుండా మూడో తరగతి నుంచే హైస్కూల్లో కలపడం వల్ల అది కూడా హై స్కూల్ బాధ్యత కిందకు వచ్చేలా చేశామని తెలియజేశారు...
గుంటూరు పల్నాడు రెండు జిల్లాల కలెక్టర్లు తమ సందేశాలను వినిపించారు..
పిడుగురాళ్ల లాంటి కొన్ని హైస్కూల్ వాళ్ళు తమ స్కూల్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
0 Comments:
Post a Comment