Guavas : జామపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే రోజుకో జామపండు తినమని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు.
జామలో నీరు, కొవ్వు, ప్రొటీన్,పీచుపదార్ధం, విటమిన్ సి, పాస్పరస్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఖానిజాలు ఉంటాయి.
ఇవి మన ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారు రోజుకో పండు తింటే దాని నుండి బయటపడవచ్చు. కీళ్ల నొప్పులు తొలగిపోతాయి.
జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. బరువు తగ్గాలనుకునే వారికి జామ మంచి ఔషధంగా చెప్సవచ్చు. పచ్చి జామ కాయల్లో పాస్పరిక్ ఆక్సాలిక్ ఆమ్లాలు ఉంటాయి.
వీటిని తింటే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దోరగా, పండిన గింజలు తక్కువగా ఉన్న జామ పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఎక్కవ గింజలతో ఉన్న జామ పండ్లను తింటే అపెండిసైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె బలహీనంగా ఉన్నవారు, బహిష్టు సమస్యలు ఉన్నవారు జామ గుజ్జును తేనె, పాలతో కలపి తీసుకోవాలి. జామ నుండి లభించే పీచు షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది.
జామలో ఉండే బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచటంతోపాటు, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
తలనొప్పి మైగ్రేన్ సమస్యలతో బాధపడేవారు పచ్చి జామపండును ముద్దలా నూరి రోజులో మూడుసార్లు నుదిటిపై పెట్టుకుంటే నొ్పి తగ్గుతుంది.
జీర్ణక్రియలను వేగవంతం చేయటంలో జామ సహాయపడుతుంది. జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. జామలో ఉండే విటమిన్ సి శరీరానికి కావాల్సిన కాల్సియంను అందిస్తుంది.
శరీరానికి తక్షణం శక్తినిచ్చే ఆహారంగా కూడా జామను చెప్పవచ్చు. చిగుళ్ల నుండి రక్తం కారే సమస్యతో బాధపడుతున్నవారికి జామ లేత ఆకులను నమిలితింటే సమస్య తగ్గుతుంది.
జామ ఆకుల పేస్ట్ ను మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లెజాన్ ఉత్పత్తికి జామ తీసుకోవటం అవసరం. జామలో కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయి.
0 Comments:
Post a Comment