✍️సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ పై 10న ఉత్తర్వులు
♦కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ సమాచారం
🌻ఈనాడు-అమరావతి: రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన గ్రామ, వార్డు సచివా యా ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసేందుకు ఈనెల 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈలోగా ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. కలెక్టర్లతో ఉన్నతాధికా రులు గురువారం వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొబే షన్ ఖరారైన ఉద్యోగులకు జులై 1 నుంచి కొత్త స్కేల్ ప్రకారం వేతనాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో 1,17,954 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రొబేషన్ ు జిల్లా స్థాయిలో ఏయే ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు ఖరారు చేయాలో సచివాలయాల శాఖ స్పష్టత ఇచ్చింది.
0 Comments:
Post a Comment