Govt Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ... ప్రకటించిన ప్రధాని మోదీ.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ (Central Govt Jobs) కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది.
వందలు, వేలల్లో కాదు... లక్షల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ కూడా పెట్టుకుంది. వచ్చే ఏడాదిన్నరలో అంటే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించారు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా అన్ని శాఖలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.
ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS), రైల్వే ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి. వీటితో పాటు ఆయా ప్రభుత్వ శాఖలు కూడా వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. రైల్వే ఉద్యోగం, బ్యాంకు ఉద్యోగం, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష వేర్వేరుగా కాకుండా ఒకే ఎగ్జామ్ నిర్వహించడమే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ లక్ష్యం. కరోనా వైరస్ మహమ్మారి రాకపోయి ఉంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇప్పటికే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET) నిర్వహించేది. కానీ కోవిడ్ 19 కారణంగా ఇప్పటి వరకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎగ్జామ్ ప్రకటించలేదు.
ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించడంతో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కార్యకలాపాలు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాదే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సెట్ జరగొచ్చు. ఈ సెట్ నెలకోసారి ఉంటుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి వేర్వేరు లెవెల్స్‌లో ఈ ఎగ్జామ్ ఉంటుంది.
0 Comments:
Post a Comment