Gas Trouble: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, యూరిన్ ఇన్ఫెక్షన్ తో నేటి యువత ఎక్కువగా బాధ పడుతుంది..
ఈ సమస్యలనుంచి బయటపడడానికి డ్రై ఫ్రూట్స్ లో ఉండే క్రాన్ బెర్రీస్ అద్భుతంగా పనిచేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. క్రాన్ బెర్రీస్ తో ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలంటే.!?
Cran Berries Drink To Check Gas Trouble and Urinary Problems
క్రాన్ బెర్రీస్ లో విటమిన్ ఎ, బి, సి, ఇ, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
ఇవి శరీరంలోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. యూరినరీ ట్రాక్ ను శుభ్రం చేస్తాయి.
గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తాయి.. ఇందుకోసం క్రాన్ బెర్రీస్ ఇలా ఉపయోగించుకోవాలి..
Cran Berries Drink To Check Gas Trouble and Urinary Problems
ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసి అందులో 10 క్రాన్ బెర్రీస్ వేసి ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి.
ఆ తరువాత ఉడికిన క్రాన్ బెర్రీస్ ను కూడా తినాలి. ఇలా ఒక వారం రోజుల పాటు తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను తొలిగిపోతాయి. కడుపు ఉబ్బరం , పొట్టలో నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తొలగిస్తుంది.
ఈ డ్రింక్ తాగడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా చేసి కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది.. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.
బరువు పెరగకుండా ఉండేందుకు ఈ డ్రింక్ సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది.
0 Comments:
Post a Comment