Flax Seeds Benefits: ఎండల కారణంగా ప్రస్తుతం భారత్‌లో చాలా చోట్ల వేడి వాతావరణం నెలకొని ఉంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతోంది.
ఈ ఎండల కారంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వేసవి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా ఉంచుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని రకాల గింజలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహ రోగులకు అవిసె గింజలు:
అవిసె గింజలు డయాబెటిక్ రోగులకు ఓ మంచి ఔషధంలా పని చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా..డయాబెటిక్‌ని నియంత్రిస్తుంది.
అవిసె గింజలలో పోషకాలు:
అవిసె గింజలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఈస్ట్రోజెన్, లిగ్నాన్స్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలను ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది:
డయాబెటిక్ రోగులు అవిసె గింజలను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు టైప్ 2 డయాబెటిస్, బ్లడ్ షుగర్ లెవెల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే.. మధుమేహకి దారి తీస్తుంది. ఎందుకంటే ఇది గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్. ) ప్రమాదాన్ని పెంచుతుంది.
0 Comments:
Post a Comment