Famous Temple: హిందూ సాంప్రదాయం ప్రకారం శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలతో పాటుగా శక్తిప్రదాయని ఆలయాలను భక్తులు అధికంగా ఆరాధిస్తుంటారు.
ఈ సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి, సకల జీవకోటిని తన చల్లని చూపుతో రక్షించే ఆది పరాశక్తి అమ్మవారిని పూజించడం అనాధికాలం నుండి వస్తున్న సంప్రదాయం.
ముఖ్యంగా గ్రామాల్లో వెలసిన దేవతలను సాధారణంగా ఒక్కో పేరుతో పిలుచుకుంటూ ఆరాధిస్తూ ఉంటాం.. అనేక ప్రాంతాల్లో శక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారు వివిధ విపత్కర పరిస్ధితుల నుండి మనల్ని కాపాడుతూ వస్తుంటారు.. శక్తి స్వరూపిణి ఇక్కడే వెలసిన క్షేత్రంగా భక్తులకు అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి.
తిరుపతి జిల్లా, తమిళనాడుకి సరిహద్దు ప్రాంతంమైన సూళ్లూరు పేటలో కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలందుకుంటున్న శ్రీచెంగాలమ్మ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
అమ్మలు గన్న అమ్మ చెంగాలమ్మ పరమేశ్వరీ అమ్మ లీలలు ఎన్నో.. శరణుకోరి వచ్చిన వారి కష్టాలను దూరం చేసి సుఖాలు ప్రసాదించే దేవతగా భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయంకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు.. అచ్చం మనిషి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలన్ని తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇస్రో శాస్త్రవేత్తలు కూడా తమ ప్రయోగానికి ముందుగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాతే తమ ప్రయోగాన్ని మొదలు పెడితారంటా.. దాదాపు పదో శతాబ్ద కాలంలో శుభగిరి అనే గ్రామంలో గొల్లకులస్తులు అధికంగా ఉండేవారు.. వీరందరూ పశువులు మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవారు.
రోజూ మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్ళారు కొందరు బాలురు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేముందు సమీపంలోని పవిత్ర కళంగినదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకునిపోతున్న సమయంలో. ఓ యువకుడు ఒక శిలను పట్టుకుని, ఆ శిల ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నాడు.
దీంతో ఒడ్డున ఉన్నవారు ఆ శిలను జాగ్రతగా ఓ చెట్టు దగ్గరకు చేర్చారు.. అష్ట భుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దునుముతున్న స్త్రీమూర్తి విగ్రహం భావించిన యువకులు ఆ విగ్రహంను పడుకోబెట్టి వేంటనే గ్రామస్తులకు తెలియజేశారు.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, గ్రామపెద్దలు మరుసటి రోజు పశువుల కాపరులతో కలిసి నది ఒడ్డున ఉన్న రావిచెట్టు వద్దకు చేరుకున్నారు.. అయితే రావి చెట్టు క్రింద పడుకోబెట్టిన విగ్రహం తానంతట తాను లేచి నిలబడి ఉండడమే కాకుండా దక్షిణ ముఖముగా నీటారుగా నిలబడి ఉండంను చూసిన పశువుల కాపర్లు ఆశ్చార్యానికి గురి అయ్యారు.. మహిసాసుర మర్ధిని స్వయంభుగా వెలసి ఉండడం చూసి గ్రామస్తులు అమ్మవారి విగ్రహంను తమ గ్రామంలోకి తీసుకెళ్ళి ఓ ఆలయంను నిర్మించి పూజించుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.
కానీ ఎంత ప్రయత్నించిన అమ్మవారి విగ్రహం ఒక ఇంచు కూడా కదలక పోవడంతో గ్రామస్తులు అంతా మరుసటి రోజు వచ్చి విగ్రహాన్ని గ్రామంలో చేర్చాలని నిర్ణయం తీసుకుని వెళ్ళి పోయారు.. అదే రోజు రాత్రి గ్రామ పెద్ద కలలో కనబడిన అమ్మవారు.. తాను అక్కడే ఉండదలచానని చెప్పడంతో గ్రామస్తులు అంతా నది ఒడ్డున రావిచెట్టు దగ్గర చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిని అయినా శాంతి మూర్తిగా కొలువుతీర్చి నిత్య పూజలు అందిస్తూ వచ్చేవారు గ్రామస్తులు..
నేటికి ఏడు సంవత్సరాలకు ఓ మారు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తుంటారు.. కాలక్రమేణా చెంగాల్ గా పిలుబడే ఈ గ్రామం వివిధ పేర్లతో పిలువబడుతూ ఆంగ్లేయుల కాలంలో సూళూరుపేట రూపాంతం చేందినట్లు తెలుస్తోంది.. ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద "సుడి మాను" తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది..
ఈ చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయం ప్రాంగణంలో తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజ గోపురం నిర్మించబడి ఉండగా, ఉప ఆలయాలలో గణపతి, లింగ రూప కైలాసనాధుడు, నాగ దేవతలు కొలువుతీరి భక్తులకు దర్శనం మిస్తుంటారు. అంతే కాకుండా ప్రధాన ఆలయం ముఖ మండపంలో నవ దుర్గా రూపాలను సుందరంగా మలచిన రూపాలు అద్భుతంగా ఉంటుంది. గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు..
చెంగాలమ్మ ఆలయానికి తలుపులు ఎందుకు లేవంటే?
కొన్ని సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయం లోనికి ప్రవేశించి భంగపడ్డాడని, అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారని, కానీ అమ్మవారు స్వప్నంలో " తనకు తన భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదని.. కలలో చెప్పడంతో ప్రాంగణంలో ఒక చోట ఉంచారట.. ఎండిపోయి, చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగిందని, ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షత్కరించడం ఒక విశేషంగా పేర్కొంటారు.
ఈ వృక్షం దగ్గర నాగ లింగం, నవ గ్రహ మండపం కొలువైయుంటాయి.. సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయలలు కట్టి నియమంగా ప్రదక్షిణలు చేస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తూ ఉంటారు ఆలయ అర్చకులు. వివాహము, ఉపనయనం,పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం, లాంటివి కార్యక్రమాలు ప్రతినిత్యం ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఏడు సంవత్సరాల కొకసారి మే-జూన్ నెలల మధ్య అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది.
ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సుడిమాను ప్రతిష్ట, బలి సంహరణతో ప్రారంభంమై, రెండో రోజు నుండి నాలుగో రోజు వరకు సుడిమానుకు చక్రం, నల్లమేక, పూలమాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు.. మూడో రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడంతో లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు అయిదో రోజున కాళింకి నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు.
0 Comments:
Post a Comment