Search This Blog

Wednesday, 22 June 2022

Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. తొలిసారి గిరిజన మహిళ... ద్రౌపది ముర్ము ప్రస్థానం ఇలా....

 Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. తొలిసారి గిరిజన మహిళ..

Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. తొలిసారి గిరిజన మహిళ..
భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తన అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని(Draupadi Murmu) బరిలోకి దింపింది.
ఇక ఫలితమే తేలాలి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను నిలిపితే NDA తన అభ్యర్థిగా ముర్మును తెరపైకి తెచ్చారు. ఉదయం నుంచి చత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికే పేరు వినిపించింది. కానీ పార్లమెంటరీ కమిటీ భేటీ తర్వాత ద్రౌపతి ముర్మును ప్రకటించింది బీజేపీ. అంతకుముందు, రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై మేధోమథనం చేయడానికి బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. విపక్షాల అభ్యర్థిగా సిన్హా పేరును ప్రకటించిన తర్వాత, తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పుడు జూలై 18న ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ పత్రాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సంఖ్యాబలం ప్రాతిపదికన పటిష్ట స్థితిలో ఉందని, దానికి బీజేడీ లేదా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతు లభిస్తే విజయం ఖాయం అని గమనించాలి.

🌹ద్రౌపది ముర్ము ప్రస్థానం:

1958 జూన్ 20న పుట్టిన ద్రౌపది ముర్ము.. బీఏ వరకు చదువుకున్నారు. శ్యామ్ చరణ్ ముర్మును పెళ్లాడిన ఈమెకు ఒక కుమార్తె వున్నారు. ఒడిశా ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన.. ద్రౌపది అనంతరం 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాయ్‌రంగాపూర్ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. 1997లో ఒడిశా బీజేపీ ఎస్టీ మోర్చా విభాగానికి ఉపాధ్యక్షరాలిగా పనిచేశారు.

2000లో తొలిసారి రాయ్‌రంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002-09 వరకు బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు. 2004లో మరోసారి రాయ్‌రంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006 నుంచి 2009 వరకు బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చాకు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.

2007లో ఎమ్మెల్యేగా అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ''నీలకంఠ అవార్డ్''ను అందుకున్నారు ద్రౌపది. 2010 నుంచి 2015 వరకు మయూర్‌భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013 నుంచి 2015 వరకు బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top