Diabetes: ఎక్కువమంది బాధపడుతున్నా ఆరోగ్య సమస్యలు డయాబెటిస్, హైబీపీ.. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి నిత్యం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి..
కొంత మందికి అధిక రక్తపోటు ఉంటే మరికొందరికి మధుమేహం ఉంటుంది. వారిలో కొన్ని అనుమానాలు ఉంటాయి.
అధిక రక్తపోటు ఉన్న వారికి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా.. డయాబెటిస్ ఉన్నవారికి హైబీపీ వచ్చే అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నారు..!? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!
Diabetes: Patients Attack chances Of Blood Pressure
హై బి.పి ఉన్నవారికి మధుమేహం వస్తుందా.!?
అధిక రక్తపోటు ఉన్నవారిలో వారి రక్తపోటు నియంత్రణలో ఉండే లాగా చూసుకోవాలి. హైబీపీ ఉన్నవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎందుకంటే రక్తపోటు ఉన్న వ్యక్తులు సాధారణంగా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు.
బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ను 130/80 నియంత్రణలో ఉంటే మధుమేహం వచ్చే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. 140/90 ఉంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
Diabetes: Patients Attack chances Of Blood Pressure
డయాబెటిస్ ఉన్నవారికి హైబీపీ.!?
మధుమేహం ఉన్నవారు కూడా డయాబెటిక్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే అధిక రక్తపోటు ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది.
ఎందుకంటే మధుమేహం వల్ల ధమనులు దెబ్బతింటాయి. రక్తనాళాలను గట్టిపడేలా చేస్తాయి. దాంతో రక్తపోటు పెరుగుతుంది.
దీనికి చికిత్స చేయకపోతే రక్తనాళాలు దెబ్బతినడం, గుండెపోటు రావడం, మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు అధికమవుతాయి.
మధుమేహం ఉన్నవారు ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాకుండా చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment