Diabetes: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల మధుమేహం, దంతాలు, కడుపు సమస్యలు, ఎముకలకు సంబంధించిన రోగాలు సర్వసాధారణంగా మారిపోయాయి.
ఈ సమస్యల నుంచి బయటపడేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని మాత్రం తగ్గించుకోలేకపోతుంటారు.
ఈ రోజుల్లో ప్రమాదకరమైన రోగాలు సైతం సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. ముఖ్యంగా వీటిలో మధుమేహం ఒకటి. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే.. మనం ఉన్నంత కాలం మనతోనే ఉంటుంది కానీ పూర్తిగా తగ్గదు. కానీ దీనిని నియంత్రణలో ఉంచుకోకపోతే ప్రాణాల మీదికొచ్చే అవకాశం ఉంది.
అయితే మెడిసిన్స్ తో పాటుగా.. వంటింట్లో లభించే వాటితో కూడా డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ప్రతి వంటింట్లో ఉండే లవంగాలు (clove) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడమే కాదు కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కడుపు పూతల వంటి ఎన్నో వ్యాధులకు నివారణలా పనిచేస్తుంది. లవంగాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి.
డయాబెటీస్ పేషెంట్లకు మేలు.. డయాబెటీస్ పేషెంట్లకు లవంగాలు ప్రయోజనకరంగా ఉంటాయి. లవంగాలలో నిజారిసిన్ ఉంటుంది.
ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే వీటిని డయాబెటీస్ పేషెంట్లు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా వదిలిపోతుంది.
లవంగాలలో యూజెనాల్ అని పిలువబడే ఫైటోకెమికల్ పదార్థం ఉంటుంది. ఇది ఆక్సీకరణ నష్టాన్ని నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. అందుకే వీటిని తరచుగా తింటూ ఉండాలి.
నిజానికి లవంగాలలో ఉండే యూజెనాల్ కాలెయాన్ని శుభ్రపరచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఈ లవంగాలు కాలెయ వ్యాధులను సైతం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వీలైతే వీటిని టీ లేదా కూరగాయల్లో వేసుకుని తింటూ ఉండండి.
లవంగాలు మన శరీరంలో ఉండే విష పదార్థాలను కూడా బయటకు పంపుతాయి. అలాగే తలనొప్పి సమస్యకు కూడా చెక్ పెడుతుంది. అధిక రక్తపోటును సైతం కంట్రోల్ లో ఉంచుతుంది.
అల్సర్, కడుపు నొప్పి, మంట, వాపు వంటి సమస్యలకు లవంగాలలో ఉండే యూజెనాల్ చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుందని ఆరోగ్యన నిపుణులు చెబుతున్నారు.
ఇన్ని ప్రయోజనాలున్న లవంగాలను మోతాదులోనే తినాలి. పరిమితికి మించి తింటే మాత్రం నోరు పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
అందుకే తినాలనుకునే వారు రోజుకు నాలుగైదు మాత్రమే తినండి. ఇక పిల్లలకు ఎంత తక్కువిస్తే అంత మంచిది.
0 Comments:
Post a Comment