Dehydration Symptoms On Skin: శరీరంలో నీటి శాతం తగ్గితే.. అనేక వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా అలసట, తల తిరగడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు వచ్చే అవకాశాలున్నాయి.
శరీరంలో నీరు శాతం తగ్గిపోతే వీటి ప్రభావం జుట్టు, చర్మంపై కూడా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చర్మంలోనైతే.. ముడతలు రావడం వంటి సమస్యలు వస్తాయని వారు పేర్కొన్నారు.
అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి నీరు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. నీటీని అధిక మోతాదులో తీసుకోకపోతే శరీరంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలుసుకుందాం..
శరీరంలో నీరు లేక పోతే ఇలాంటి సమస్యలు వస్తాయి:
చర్మం పొడి బారడం:
ప్రస్తుతం చాలా మంది చర్మం పొడిబారడం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు ముఖ్య కారణం తగినంత శరీరంలో నీటి శాతం లేకపోయినందునేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శరీరంలో నీరు తగ్గిపోయి చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లిప్స్ క్రస్టింగ్:
పెదవులపై స్కాబ్లింగ్ కూడా డీహైడ్రేషన్ చర్మం యొక్క లక్షణం. శరీరంలో నీటి కొరత కారణంగా..పెదవులపై చర్మం చనిపోయి కణాలు గడ్డకట్టి వివిధ రకాల పెదవుల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా పెదవుల పగుళ్లు ఏర్పడతాయి.
చర్మంపై దురద:
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీటి కొరత కారణంగా.. చర్మంపై దురద, చర్మం ఎరుపు రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనితో పాటు చర్మంపై దద్దుర్ల సమస్య కూడా ఉత్పన్నమవుతాయి.
ముడతలు:
వయసు పెరిగేకొద్దీ ముఖం, చేతులపై ముడతలు రావడం సాధరణం. చిన్నతనంలోనే ముఖంపై ముడతలు వస్తే అది శరీరంలో నీటి కోరతేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
0 Comments:
Post a Comment