CSIR Recruitment: బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరకఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు (02), ప్రాజెక్ట్ అసోసియేట్లు (11), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 20,000 నుంచి రూ. 42,000 వరకు చెల్లిస్తారు.
* ఇంటర్వ్యూలను జూన్ నెలలో 20-27 తేదీల మధ్య నిర్వహిస్తారు.
* ఇంటర్వ్యూను సీఐఎంఎఫ్ఆర్, పోస్ట్ – బర్వా రోడ్, ధన్బాద్, ఝార్ఖండ్లో నిర్వహిస్తారు.
0 Comments:
Post a Comment