ఉపాధ్యాయులకు యాప్ ల భారం తగ్గించండి
ప్రతి పాఠశాలకు కంప్యూటర్ ఆపరేటర్ నియమించండి*
కృష్ణా జిల్లా కలెక్టర్ గారి సూచన
ఈ రోజు విజయవాడలో ఉమ్మడి కృష్ణ మరియు గుంటూరు జిల్లాల హెచ్ఎంలకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ భాషా మాట్లాడుతూ... పాఠశాల విద్యా కమిషనర్ గారికి ఒక సూచన చేస్తూ పాఠశాలల్లో వివిధ రకాల యాప్ వలన ఉపాధ్యాయులు, హెచ్ ఎం లు పలు ఇబ్బందులు ఎదుర్కొనడం గమనించానని., వాటి భారం తగ్గించాలని కోరారు.
అలాగే ప్రతి పాఠశాలకు కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించాలని వారి తరఫున కోరుతున్నానని కూడా సభా ముఖంగా సి.ఎస్.ఈ. గారికి విజ్ఞప్తి చేశారు.
గౌ. కలెక్టర్ గారి వ్యాఖ్యలతో శిక్షణ కు హాజరైన వందలాది హెచ్ఎం లందరూ హర్షధ్వానాలతో సంతోషం వ్యక్తం చేశారు.
చేయాల్సిందే: సి.ఎస్.ఈ. సురేష్ కుమార్
అయితే ఈ అంశంపై
సి.ఎస్.ఈ గారి నుండి ఏ విధమైన ప్రతిస్పందన లభించకపోవడం కొసమెరుపు.
పైగా సి.ఎస్.ఈ. గారి ప్రసంగంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాలను ప్రైవేట్ ఉపాధ్యాయుల వేతనాలతో పోల్చి చెబుతూ ...
ఇలాంటి బాధ్యతలన్నీ తప్పనిసరిగా చేయాల్సిందేనంటూ స్పష్టం చేయడం గమనార్హం.
0 Comments:
Post a Comment