Champion: మట్టిలో మాణిక్యాలు ఉంటాయని చాలా సందర్భాల్లో రుజువైంది. సరైన వసతులు కూడా లేని మారు మూల గ్రామాల్లో పుట్టిన ఎందరో ప్రపంచ ఖ్యాతి సాధిస్తూ..
భారత జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెప రెపలాడేలా చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం చంద్రం పేట గ్రామానికి చెందిన కుర్రాడు శనాపతి గురునాయుడు
స్వర్ణ పతకంతో మెరిసాడు. అది కూడా ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను తీర్చదిద్దడంతో పలు రికార్డులు సాధించాడు.
కొండవెలగాడ గ్రామంలో గత కొన్నాళ్లుగా శిక్షణ పొందిన వెయిట్ లిఫ్టర్ శనాపతి గురునాయుడు.. మెక్సికోలో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో తొలిస్థానంలో నిలిచి అతడు స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు.
గతంలో కొండ వెలగాడ గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి సహా అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలు సాధించి రికార్డులు స్ళష్టించారు.
మెక్సికోలో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మొదటి స్థానం సాధించాడు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్ అయిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత దేశం నుంచి 10 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు.
అందులో ఏపీ నుంచి ముగ్గురు పాల్గొన్నారు. వీరిలో 16 ఏళ్ల గురునాయుడు ఒకరు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన బాలుర 55 కేజీల ఈవెంట్‌లో మొత్తం 230 కిలోలు ఎత్తి రెండు స్వర్ణాలు, ఒక వెండి పతకం సాధించాడు. యూత్ వరల్డ్ విభాగంలో తొలి స్వర్ణం సాధించాడు గురు నాయుడు.
ఈ పోటీల్లో సౌదీ అరేబియాకు చెందిన అలీ మజీద్ 229 కేజీలతో సెకెండ్ ప్లేస్ సాధించగా.. కజకిస్థాన్‌కు చెందిన్ ఉమ్రోవ్ 224 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.
ఈ ఈవెంట్ లో తొలిసారి బంగారుపతకం నెగ్గిన భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన గురునాయుడ్ని టీమ్ మేనేజ్మెంట్, కోచ్ లు, తోటి క్రీడాకారులు అభినందించారు.
మెక్సికో లో జరిగిన యూత్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బాలుర 55 కిలోల విభాగంలో గురునాయుడు సాధించిన విజయం పట్ల కొండవెలగాడ గ్రామస్తుల నుండి దేశ ప్రముఖుల వరకూ పలువురి ప్రశంసలు అందుకున్నాడు.
జిల్లా కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన గురునాయుడు ను అభినందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి జిల్లాలోని యువతకు గురునాయుడు స్పూర్తి గా నిలుస్తారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి ఆకాంక్షించారు.
0 Comments:
Post a Comment