తెలుగుభాష, సాహిత్యరంగాల్లో విశేష కృషిచేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ జ్యోతిషం కోర్సుకు చాలా డిమాండ్ ఉంది.
దేశంలో ఏ వర్సిటీలో లేని ఈ కోర్సును మన తెలుగు వర్సిటీ మాత్రమే ఈ కోర్సు (Course0 ను అందిస్తోంది.
ఈ కోర్సులో ప్రవేశాలకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా ఈ కోర్సుల విషయంలో యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకొంది.
ఎంఏ జ్యోతిషం కోర్సులో చేరేందుకు ఎంబీబీఎస్, బీటెక్ (BTech) పూర్తిచేసిన విద్యార్థులకు అర్హత కల్పించింది.
ఇప్పటి వరకు బీఏ, బీఎస్సీ (B.Sc), బీకాం చేసిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పించేవారు. తాజాగా వర్సిటీలో నిర్వహించిన అకాడమిక్ సెనెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. వర్సిటీలో రెండు కొత్త విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
యూనివర్సిటీ తీసుకొన్న కొత్త నిర్ణయాలు..
- వర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల్లో మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్‌కు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
- నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాలో 1 పీహెచ్‌డీ సీటు ఉంది. సీట్లను రెండుకు పెంచారు.
- ఉస్మానియా కోర్సుల ఫీజుల విధానాన్ని అనుసరించి పలు కోర్సుల ఫీజులను పెంచారు.
- మ్యూజిక్, చరిత్ర, టూరిజం, డ్యాన్స్ కోర్సుల్లో 18 విభాగాల్లో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సిలబస్‌లో మార్పులు చేశారు.
ఈ సారి యూనివర్సిటీలో కొత్తగా మూడు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి లైబ్రరీసైన్స్ (బీసీజే, ఎంసీజే), యోగా (ఎంఏ యోగా),
బీఎఫ్‌ఏ డిజైన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. త్వరలో నిర్వహించే అకడమిక్ సెనేట్ సమావేశంలో ఈ కోర్సులపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విద్యాసంవత్సరంలోనే ఎంఎఫ్‌ఏ (మాస్టర్స్ ఇన్ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్), ఎంఏ (చరిత్ర, కల్చర్ అండ్ టూరిజం) కోర్సులను ప్రవేశపెట్టారు.
Career and Course: ఫైనాన్స్ రంగంలో కెరీర్ ఎంచుకొనే వారికి బెస్ట్ చాయిస్స్.. ఐఎస్‌బీలో ఆన్‌లైన్ కోర్స్
యూనివర్సిటీ ఒక్కో విభాగంలో నాలుగు చొప్పున మొత్తం 8 కోర్సులను ప్రవేశపెడతారు.
పలు కోర్సుల ఫీజులు ఇతర కాలేజీల్లో 1.50 లక్షల వరకు ఉండగా, తెలుగు వర్సిటీలో రూ.50 వేల ఫీజుతోనే పూర్తి చేసుకొనే అవకాశాన్ని కల్పించారు.
ఇక మాతృభాషలో లైబ్రరీ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తంగా అన్ని విభాగాల్లో 19 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
0 Comments:
Post a Comment