BREAKING : టీడీపీ పార్టీ నేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి అయ్యనపాత్రుడు పై 12 కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఈ నేపథ్యంలో.. మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు.
ఏ క్షణమైనా.. అయ్యన్న పాత్రుడుని.. అరెస్ట్ చేసే.. అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే… అయ్యనపాత్రుడుని.. అరెస్ట్ చేస్తారని.. ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇప్పటికే.. అయ్యనపాత్రుడు ఇంటి గోడను పోలీసులు… పగుల గొట్టారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసు బలగాలు
నర్సీపట్నం: మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అర్థరాత్రి మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. నర్సీపట్నంలోని ఆయన ఇంటి గోడను జేసీబీలతో కూల్చారు. పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారని పురపాలక సిబ్బంది తెలిపారు. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తారీకుతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు.
మళ్లీ కొనసాగుతున్న గోడ తొలగింపు పనులు
మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసు బలగాలు
అయ్యన్న కుటుంబ సభ్యులు కాసేపు అడ్డుకోవడంతో ఆగిన గోడ కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది మళ్లీ ప్రారంభించారు. వెనుక ఉన్న వంట ఇంటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీనిని అడ్డుకొన్న మహిళలను పోలీసులు బయటకు తరలించారు. అయ్యన్న పాత్రుడు ఇంటికి దారి తీసే రెండు మార్గాలను పోలీసులు ఇప్పటికే మూసివేశారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసు బలగాలు మోహరింపు చేయగా.. మీడియాను కూడా పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు భారీగా పోలీసులను మోహరించారు.
0 Comments:
Post a Comment