ఆరోగ్యం సంగతి పక్కన పెడితే, ఎండలో తిరగడం వల్ల ముఖ్యంగా చర్మం పాడైపోతుంది.
ట్యాన్ పేరుకుపోయి అందవిహీనంగా, కళాకాంతులు లేకుండా తయారవుతుంది.
ఈ ట్యాన్ ను తొలగించుకునేందుకు ఒక సింపుల్ చిట్కా ఉంది.
ఇందుకోసం అందుబాటులో టమాటో, నిమ్మకాయ ఉంటే సరిపోతుంది.
ముందుగా బాగా పండిన ఒక టొమాటోను తీసుకుని పై తోలు తీసేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ రసం మొత్తాన్ని పిండాలి.
దీన్ని ముఖం, మెడ, చేతుల మీద రాసుకోండి. ఈ ప్యాక్ చాలా పల్చగా ఉంటుంది కాబట్టి రెండు మూడు కోటింగ్ లు వెయ్యండి. ఆపై చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోండి.
0 Comments:
Post a Comment