రతన్ టాటా" ఈ పేరు వింటే యువ వ్యాపారవేత్తలకు ఒక పూనకం. టాటా తనకు వారసత్వం ప్రకారం వచ్చినా సరే సంస్థను ఆయన నిలబెట్టిన తీరు ఇప్పటికీ ఒక సంచలనం.
ఇక ఆయన దేశ భక్తి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే మరి.
ఇక వ్యాపార సామ్రాజ్యంలో ఆయన్ను అజాత శత్రువుగా చెప్తూ ఉంటారు. అయితే ఆయన వివాహం చేసుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు.
రతన టాటా ఇండియా లో ఆర్కిటెక్ట్ లో డిగ్రీ పట్టా పొంది ఆ తర్వాత అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ రోజుల్లోనే అమెరికా లో బెంజ్ కార్ లో తిరిగారు ఆయన.
తన స్నేహితులు ఎవరైనా గట్టిగా డోర్ వేస్తే మెల్లగా వేయమని చెప్పే వారట. వినకపోతే సీరియస్ అయ్యే వారట. వస్తువులను చాలా జాగ్రత్తగా వాడతారట.
ఇక ఆయన పెళ్లి ఎందుకు చేసుకోలేదో ఒకసారి చూస్తే. అమెరికా లో ఉన్నపుడు అక్కడి యువతిని ప్రేమించారు రతన్ టాటా.
కానీ చదువు తరువాత ఇండియా వచ్చేయడమే ఆయన టార్గెట్. దానికి ఆ అమ్మాయి నో చెప్పడంతో పెళ్లి వద్దు అనుకున్నారు.
1969 లో భారత దేశానికి తిరిగి వచ్చి టాటా స్టిల్స్ లో సాధారణ ఉద్యోగిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అందులో అన్ని విషయాలు తెలుసుకుని, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో నేర్చుకుని జెఆర్డి టాటా తరువాత టాటా సంస్థల పగ్గాలు చేబట్టి 1990 నుండి టాటాను మరో స్థాయికి తీసుకు వెళ్ళారు.
రతన్ టాటా పగ్గాలు చేపట్టే సమయం లో టాటా కు వందకు పైగా సంస్థలు ఉంటే. వాటిల్లో 40 నష్టాల్లో ఉండేవి. దీనితో వాటిని గాడిలో పెట్టడానికి స్వయంగా కష్టపడ్డారట.
0 Comments:
Post a Comment