'దారి' కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయ కుటుంబం.. చక్రాల కుర్చీలో తాడేపల్లి బాట
బాపట్ల జిల్లాలో వైకాపా నేతల దౌర్జన్యానికి ఓ ఉపాధ్యాయురాలి కుటుంబం రోడ్డున పడింది. ఇంటికి వెళ్లే దారిలో వైకాపా నేతలు గోడకట్టారని కొరిశపాడు మండలం బొడ్డువానిపాలేనికి చెందిన సుధారాణి వాపోయారు.
న్యాయం చేయాలంటూ ముగ్గురు పిల్లలతో కలిసి.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చక్రాల కుర్చీలో బయలుదేరిన సుధారాణితో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.
'దారి' కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయ కుటుంబం
అడ్డుకున్న పోలీసులు: ఉపాధ్యాయురాలు సుధారాణి కుటుంబాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇంటికి వెళ్లే దారిలో వైకాపా నేతలు గోడకట్టారని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చక్రాల కుర్చీలో వచ్చిన ఆమెను తాడేపల్లిలో పోలీసుల అడ్డుకున్నారు. సీఎంవోకు వెళ్లేందుకు కుదరదని.. కొరిశపాడు తహశీల్దార్ వస్తున్నారని పోలీసులు చెప్పడానికి ప్రయత్నించారు
0 Comments:
Post a Comment