భారతదేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం మేర ఆస్తుల వ్యాల్యూ పెరుగుతుందని అంచనా వేసింది. గత అయిదేళ్లలో ఇది గరిష్టం.
గత నెల 11వ తేదీ నుండి 27వ తేదీ మధ్య కాలంలో పదమూడు మంది రియాల్టీ ఎక్స్‌పర్ట్స్ నుండి సమాచారాన్ని సేకరించింది. దీని ఆధారంగా నివేదికను రూపొందించింది.
వచ్చే ఏడాది, 2024 నాటికి సగటు ఇళ్ల ధరలు ఆరు శాతం పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది 5 శాతం మేర పెరుగుతాయని అంచనా వేసింది.
ఢిల్లీతో పాటు ముంబైలో ధరలు వచ్చే ఏడాది నుండి నాలుగు శాతం నుండి ఐదు శాతం మేర పెరుగుతాయని అంచనా.
బెంగళూరు, చెన్నైలలో ధరలు 5.5 శాతం నుండి 6.5 శాతం మేర పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు.
స్టీల్, సిమెంట్ ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రెంట్లు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఎస్ఈ ఇండెక్స్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీలు గత ఏడాది కాలంలో 21 శాతం జంప్ చేశాయి. అదే సమయంలో సెన్సెక్స్ 15 శాతం మాత్రమే లాభపడింది.
అంటే రియాల్టీపై ఇన్వెస్టర్లు చాలా ఆశావాహ దృక్పథంతో కనిపిస్తున్నారు.
ముంబై, ఢిల్లీ-NRC ప్రాంతాల్లో వచ్చే ఏడాదిన్నర కాలంలో 4 శాతం నుండి 5 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
0 Comments:
Post a Comment