ఇంటి విషయంలో చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సొంత ఇంటి నిర్మాణం అంటే ఎన్నో విషయాలు ఆలోచించి ఆ తర్వాత అడుగు వేస్తారు. ప్రస్తుత ట్రెండ్ కు తగిన విధంగా నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
ఇంటి కలర్స్ అలాగే ఇంటి లోపల వాడే టైల్స్ గాని ఇతరత్రా గాని కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. ఇక చాలా మందిలో ఉండే సందేహం ఇంటి కోసం మార్బుల్స్, టైల్స్ - ఈ రెంటిలో ఏది బెస్ట్ అని.
చాలా మంది చెప్పే మాట. మార్బుల్స్ మంచిది. ఎందుకంటే దానికి బలమైన కారణం ఉంది. టైల్స్ అనేవి మట్టి నుంచి తయారు చేయడం జరుగుతుంది. మట్టి కి వుండే అన్ని లక్షణాలు దానికి ఉండటం ప్రధాన సమస్యగా చెప్తారు.
ఎవరైనా యోగ గాని ధ్యానం గాని చేసే సమయంలో డైరెక్ట్ గా కింద కూర్చోకుండా, మ్యాట్ వాడతారు. దానికి కారణం ఎప్పుడైతే డైరెక్ట్ గా భూమ్మీద కూర్చుంటామో మనం ధ్యానంలో ఉత్పత్తి చేసిన ఒక శక్తిని భూమి లాగేసుకుంటుంది.
టైల్స్ ఫ్లోర్ ఉన్న ఇంట్లో కూడా ఎవరైతే కాళ్లకు ఎటువంటి పాదరక్షలు లేకుండా నడుస్తారో వాళ్లకు కొంచెం శక్తి నష్టం జరగడమే కాకుండా కాళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నవారు, టైల్స్ ఫ్లోర్ మీద పాదరక్షలు లేకుండా తిరగడం మంచిది కాదు.
అయితే మార్బుల్స్ తో ఈ సమస్య ఉండదు. కాని అవి మంచివే అయినా రాదు మార్బుల్స్ వాటి రంగును కోల్పోతూ ఉండటంతో చాలా మంది ఇష్టపడరు.
వాటిని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ఉండటంతో మార్బుల్స్ మైంటైన్ చేయడం ఖర్చుతో కూడిన వ్యవహారం. కాని డబ్బు ఆదా అవుతుంది టైల్స్ తో.
0 Comments:
Post a Comment