విజయవాడకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్
♦️ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగు
పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం త్వరలో విజయవాడలో ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఈ కార్యాలయం ఇబ్రహీంపట్నంలోని ఆంజనేయ టవర్స్‌లో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతుంది. ఇప్పుడు విజయవాడలోని అడిట్ జనరల్ (ఎజి) కార్యాలయం వద్దకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఆంజనేయ టవర్స్‌లోనే ఉన్న మధ్యాహ్న భోజనం పథకం డైరెక్టరేట్ కార్యాలయం విజయవాడలోని భారతీ నగర్లోకి వచ్చింది. ఎసిసిఇఆర్ టి డైరెక్టరేట్ కార్యాలయం కూడా విజయవాడలోని ఆటోనగర్ వద్ద ఉన్న జి స్క్వేర్ హోటల్ వద్దకు వచ్చింది. సోమవారం నుంచి కార్యాలయాన్ని ఇక్కడకు మార్చినట్లు ఎస్ సిఇఆర్టి డైరెక్టరు బి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఆంజనేయ టవర్స్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌తో పాటు రాష్ట్ర ఖజనా కార్యాలయం, గనులు, భూగర్భశాఖ డైరెక్టరేట్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం విజయవాడకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం ఈ ఫైల్ పెండింగులో ఉంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఎజి కార్యాలయం వద్దకు రానుంది.
0 Comments:
Post a Comment