✍️జీవోలను అమలు చేయాల్సిందే
♦️విద్యా సంస్థలకు మంత్రి బొత్స ఆదేశం
🌻తాడేపల్లి (వడ్డేశ్వరం), న్యూస్టుడే : తమపిలలకు తలిదండులు ఎలాంటి విద్య కావాలని కోరుకుంటారో ఆ దిశగా విద్యాసంస్థల యాజమాన్యాలు ముందుకెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరం వద్ద ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంలో ఏపీ ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు, జీవోలను తప్పనిసరిగాఆచరించాల్సిందేనన్నారు. ఈ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలు, ఫలితాలపై విమర్శలు వచ్చాయని.. వీటిపై విద్యావంతులు, మేధావులో చర్చ జరగాలని అన్నారు. రాజకీయ పార్టీల వ్యాఖ్యలను తాను అసలు పట్టించుకోనన్నారు. ప్రతి పాఠశాలకూ ఆటస్థలం ఉండాలని, ఆ స్థలాన్ని మ్యాపింగ్ చేస్తామన్నారు. ప్రభుత్వం ముద్రించినపాఠ్యపుస్తకాలను ఉపయోగించాలన్నారు. పాఠశాలలకు ఎన్వోసీ విషయంలో
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, అసోసియేషన్
ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఫలితాలు
సాధించిన విద్యాసంస్థలకు అసోసియేషన్ తరపున మంత్రి సత్యనారాయణ జ్ఞాపికలను బహూకరించారు.
0 Comments:
Post a Comment