కొవిడ్ కారణంగా చాలామంది ఇంటికే పరిమితం కావడంతో అస్సలు ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో వారిలో బద్దకం పెరిగిపోయింది. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అలాగే తీసుకునే ఆహారంలో పోషకాల లోపం, శారీరక శ్రమ తక్కువ కావడం వంటి లక్షణాలు కూడా త్వరగా వృద్ధాప్యం రావడానికి కారణం అవుతున్నాయి.
మరి వృద్ధాప్య సమస్యలకు (Aging problems) దూరంగా ఉండి యవ్వనంగా (Young) ఉండాలంటే వారి జీవనశైలిలో మార్పులు తప్పనిసరి.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన జీవనశైలిలోని (Lifestyle) చెడు అలవాట్లే (Bad habits) మన వయసును శాసిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాంతో జ్ఞాపకశక్తి తగ్గడం, చర్మం ముడతలు పడడం వంటి ఇతర సమస్యలు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు కారణం. కాబట్టి ఈ రకమైన సమస్యలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి..
ఇంటికే పరిమితం కాకుండా వారానికి ఒకసారైనా చుట్టుపక్కల ప్రదేశాలకు వెళుతూండాలి. ఇలా చేస్తే మానసిక ఆందోళన (Psychological anxiety) వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అలాగే ఎక్కువ సేపు టీవీ, కంప్యూటర్ల ముందు రోజంతా కూర్చుంటే అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) మనమే కోరి తెచ్చుకున్నట్టే.
వీటి కారణంగా బీపీ, క్యాన్సర్, ఊబకాయం, డిప్రెషన్, ఒత్తిడి వంటి దీర్ఘకాలిక సమస్యలు (Chronic problems) తలెత్తుతాయి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని టీవీ, ఫోన్ చూస్తూ స్నాక్స్ ఐటమ్స్ (Snacks Items) ను ఎక్కువగా తీసుకుంటుంటారు.
వాటిలోని సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు కారణంగా శరీరంలో ఇన్ఫ్లమెషన్ పెరుగుతుంది. దీంతో వయసు త్వరగా మీద పడి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి.
ఆర్థిక, కుటుంబ, ఉద్యోగపరమైన పని, ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే హాయిగా నవ్వడం మర్చిపోతే ఒత్తిడి సమస్యలు మరింత పెరుగుతాయి. కనుక మనస్సును ప్రశాంతంగా (Calm down) ఉంచుకునేందుకు మీకు ఇష్టమైన పని చేయడం, సినిమా చూడడం, స్నేహితులతో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో కలిసిగడపడం వంటివి అనుసరిస్తే ఆనందంగా (Happy) ఉంటారు.
ముఖ్యంగా నవ్వడంతో మనసును, శరీరాన్ని విలాసంగా ఉంచే సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రోజంతా ఉల్లాసంగా (Hilarious) ఉంటారు.
అలాగే తీసుకునే ఆహారం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ద తప్పనిసరి. అంతే కాకుండా రోజులో ఎక్కువ నీటిని శరీరానికి అందించాలి. నిద్రలేమి (Insomnia) సమస్యలు కూడా ఆరోగ్యానికి ప్రధాన కారణం.
శరీరానికి నిద్ర తక్కువైతే అది కణాల వయసు మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి నిద్రపోవడం మర్చిపోతే కొన్నాళ్ళకు మిమ్మల్ని మీరే మర్చిపోతారు అన్నది గుర్తించుకోవాలి.
కనుక శరీరానికి తగినంత నిద్ర కూడా తప్పనిసరి. అలాగే శరీరానికి శారీరిక శ్రమ (Physical activity) కూడా అవసరం. రోజులో కొద్ది సమయాన్ని వ్యాయామానికి, యోగాకు కేటాయించాలి. ఇలాంటి మంచి అలవాట్లను (Good habits) అలవరచుకుంటే వృద్ధాప్యానికి దూరంగా ఉండి ఆరోగ్యంగా.. యవ్వనంగా.. ఉంటారు
0 Comments:
Post a Comment