వేంకటేశ్వరస్వామి కలియుగాదిలో తిరుమలపై నెలకొన్నాడని ప్రతీతి. ఆ దేవుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. శ్రీ మహా విష్ణువు యొక్క అర్చావ తారమే శ్రీ వేంకటేశ్వరుడు.
తిరుమల కలియుగంలోనే కాక సృష్ట్యాది నుండీ అంటే కృతయుగాది నుండీ పవిత్ర క్షేత్రంగానే ప్రసిద్ధి చెందింది. ప్రళయ కాలంలో భూమి సముద్రంలో మునిగిపోయి పాతాళానికి జారి పోయింది.
శ్రీ మహా విష్ణువు శ్వేత వరాహా రూపంతో పాతాళానికి పోయాడు. అక్కడ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. భూమిని ఉద్ధరించాడు. ఆపై భూదేవితో కూడి ఇక్కడే వుండాలని ఆ దేవుడు సంకల్పించాడు.
గరుత్మంతుణ్ణి పిలిచి వైకుంఠంలోని తన క్రీడాద్రిని భూమిపైకి తెమ్మన్నాడు. గరుడుడు వెంటనే వైకుంఠంలోని క్రీడాద్రిని తీసుకు వచ్చి తూర్పు సముద్రానికి ఐదు యోజనాల దూరంలో సువర్ణ ముఖీ తీరములో నిలిపాడు.
ఆ క్రీడాద్రి తిరుమల కొండ. వరాహ స్వామి ఆ కొండపై అలా కృత యుగాదిలోనే నెలకొన్నాడు.
వైకుంఠ లోకాధారుడేన విష్ణోః క్రీడాచలో వేంకటనామధేయః ఆనీయచ స్వర్ణము సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతోః ఇత్యాది పురాణవచనాలే ఇందుకు ప్రమాణాలు.
అలా వరాహక్షేత్రంగా పేరుపొందిన తిరుమలపైనే కలియుగాదిలో శ్రీహరి అపరావతారం అయిన శ్రీ వేంక టేశ్వరస్వామి నెలకొన్నారు.
వైకుంఠాత్పరమోహ్యేష వేంకటాభ్యో నగోత్తమః అత్రైవ నివసామ్యేవ శ్రీ భూమి సహితోన్వహమ్. ఈ వేంకటాద్రి వైకుంఠం కంటే శ్రేష్ఠమైనది.
నేను శ్రీ భూదేవీ నిత్యం ఇక్కడే నివసిస్తాను" అని ఆనాడు ఆ దేవుని మరో రూపమైన రుని నివాసంగా తిరుమల రూపొందడానికి కారణం అయింది.
0 Comments:
Post a Comment