ఏజ్ పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. కొన్ని పద్ధతులు పాటిస్తే ముడతల్ని తగ్గించుకోవచ్చు.
మీ చర్మంపై ముడతలు కలగటానికి గల ముఖ్య కారణం సూర్యుడు. అందువల్ల సూర్యకాంతికి దూరంగా ఉండండి. అలాగే గుడ్డు తెల్లసొన తీసుకొని చర్మంపై మసాజ్ చేయండి.
15 నిమిషాల వరకు వేచి ఉండండి. ఎండిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగివేయండి. అదేవిధంగా ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని ముడుతలు పడ్డ ప్రాంతంలో మసాజ్ చేయండి.
నిమ్మ ఆమ్ల గుణాలను ఎక్కువగా కలిగి ఉండటం వలన ముడుతలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
ముడుతలు లేని చర్మం కోసం నిద్ర చాలా అవసరం. కనీసం రోజులో 8 గంటల పాటూ తప్పక నిద్రపోవాలి.
అలాగే ఒక టేబుల్ స్పూన్ మేర గులాబీ నీటిని తీసుకుని అంతే మోతాదులో గ్లిజరిన్ని కలుపుకోవాలి.
ఈ రెండింటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి.
ఇది ముడతల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని ముఖానికి రాసి సున్నితంగా మర్దనా చేయాలి.
ఇలా చేయడం వల్ల ముఖంలో రక్తప్రసరణ పెరిగి చర్మం తాజాగా మారుతుంది. ఒక అరటి పండును గుజ్జులా చేసుకుని టేబుల్ స్పూన్ చొప్పున తేనె, పెరుగూ కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమం చర్మాన్ని తాజాగా మారుస్తుంది.
0 Comments:
Post a Comment